e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Ayam Cemani : ఈ కోడి ఒళ్లంతా న‌లుపే.. మాంసం, ఎముక‌లు కూడా.. ఏంటి ఈ కోడి స్పెషాలిటీ?

Ayam Cemani : ఈ కోడి ఒళ్లంతా న‌లుపే.. మాంసం, ఎముక‌లు కూడా.. ఏంటి ఈ కోడి స్పెషాలిటీ?

చూశారు క‌దా ఫోటోలు. ఈ కోడిని ప‌ట్టుకొని మొత్తం వెతికినా ఎక్క‌డా వేరే రంగు క‌నిపించ‌దు.. అంతా నలుపే. కోసి మాంసాన్ని చూసినా న‌లుపే. బొక్క‌లు కూడా న‌లుపే. కోడి అవ‌య‌వాలు కూడా న‌లుపే. అందుకే.. ఈ కోడి ఒళ్లంతా న‌లుపు అని అంటారు. ఇది మామూలుగా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఉండే నాటు కోడి కాదు. ఇది చాలా అరుదైన జాతికి చెందిన కోడి. ఈ కోడి జాతి పేరు అయామ్ సెమానీ.

అయితే.. ఈ కోడి కూర‌ను చూస్తే మాత్రం తిన‌లేరు. ఎందుకంటే.. చూడ‌టానికి కూర కూడా న‌ల్ల‌గానే ఉంటుంది. కోడి బూరు, రెక్క‌లు, ఈక‌లు, క‌ళ్లు, కాళ్లు, అవ‌య‌వాలు, మాంసం.. అన్నీ బ్లాక్‌గా ఉండ‌టం వ‌ల్ల‌.. ఈ కోడికి ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింది.

- Advertisement -

ఈ జాతి కోళ్లు మ‌న ద‌గ్గ‌ర లేవు కానీ.. ఇండోనేషియాలో అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తుంటాయి. జావా ఐలాండ్ నుంచి ఇవి వ‌ల‌స వ‌చ్చిన‌ట్టు చెబుతుంటారు. 1998 లో వీటిని యూర‌ప్‌కు కూడా ఇంపోర్ట్ చేశారు.
ఈ కోడి గురించి నేష‌న‌ల్ జియోగ్రఫిక్ చానెల్‌లో స్టోరీ కూడా వ‌చ్చింది. అయితే.. ఈ కోడి ఎందుకు ఇంత న‌ల్ల‌గా ఉంటుంది.. అంటే కోడి శ‌రీరంలోని క‌ణ‌జాలంలో ఉండే అధిక పిగ్మెంటేష‌న్ వ‌ల్ల‌. అది ఆ కోడిలో ఫైబ్రోమెల‌నోసిస్ అనే జెన‌టిక్ మార్పును క‌ల‌గ‌జేసి.. ఒళ్లంతా న‌లుపుగా మారుస్తుంది.

వీటి ఒళ్లంతా న‌లుపు అయిన‌ప్ప‌టికీ.. ఈ జాతి ఆడ‌కోళ్లు మాత్రం క్రీమ్ క‌ల‌ర్‌లో గుడ్ల‌ను పెడుతాయి. ఇక‌.. ఈ జాతికి చెందిన కోళ్ల గుడ్ల‌కు, మాంసానికి మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కోడి మాంసం ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. అందులోనూ చాలా అరుదుగా దొరుకుతుంది. ఇక‌.. ఈ కోడికి ప‌లు ర‌కాల పేర్లు కూడా ఉన్నాయి. కొంద‌రు దీన్ని పౌల్ట్రీకే లంబోర్గిని అని పిలుస్తారు. ఇంకొంద‌రు గోత్ చికెన్ అంటారు. దీన్ని చూడ‌గానే చాలామంది ఆ కోడికి ఆక‌ర్షితులు అవుతార‌ట‌. నల్ల‌గా ఉన్నా ముద్దుగా, అందంగా ఉంటుంద‌ట ఈ కోడి. అందుకే దీన్ని ప్ర‌పంచంలోనే అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన కోడిగానూ పిలుస్తుంటారు.

మ‌న దేశంలో క‌డ‌క్‌నాథ్ పేరుతో

ఈ అయామ్ సెమానీ జాతికి చెందిన ఈ కోళ్లు మ‌న దేశంలోనూ అక్క‌డ‌క్క‌డ ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ఈ కోళ్ల‌ను మ‌న ద‌గ్గ‌ర క‌డ‌క్‌నాథ్ పేరుతో పిలుస్తుంటారు. ఈ కోళ్లు ఎక్కువ‌గా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిని పెంచుతున్నారు. అయితే ఈ కోళ్ల‌ను ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నాటు కోళ్ల ఫామ్‌తో పాటు క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను కూడా పెంచి.. కిలో మాంసాన్ని వెయ్యి నుంచి 1500 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు.

ఈ కోడి చూడ‌టానికి న‌ల్ల‌గా ఉన్నా.. దీంట్లో ఉండే ప్రొటీన్స్‌, ఇత‌ర విట‌మిన్స్ వ‌ల్ల‌.. శ‌రీరానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ట‌. అందుకే.. ఈ కోడి మాంసానికి మ‌న ద‌గ్గ‌ర కూడా ఫుల్ డిమాండ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఆ 2 ద్వీపాల మ‌ధ్య దూరం 4 కిలోమీట‌ర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా

ఆ ఊరిపెద్ద భారత్‌లో భోజనం చేస్తాడు.. మయన్మార్‌లో నిద్రపోతాడు!

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మ‌న శ్లోకాల కంటే పొడ‌వైనది

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement