రాజ్‌కోట్: గుజరాత్లో తల్వార్ రాస్ ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ఐదురోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. రాజ్‌కోట్‌కు చెందిన రాజకుంటుంబం గత 12 ఏండ్లుగా ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవాల్లో 200 మందికిపైగా రాజ్‌పుత్ మహిళలు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కత్తులను చేబూని నృత్య ప్రదర్శనలు చేశారు. కత్తులతో రకరకాల విన్యాసాలు చేసి చూపించారు.
‘తల్వార్ రాస్ ఉత్సవాలను గత 12 ఏండ్లుగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది కొత్త బృందం ఈ ఉత్సవాల్లో కత్తి విద్యలను పదర్శిస్తున్నది. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు’ అని రాజ్‌కోట్‌కు చెందిన రాకుమారి కాదంబరి దేవి చెప్పారు. కత్తి తమకు దేవతతో సమానమని, అందుకే తాము ప్రతి ఏడాది శస్త్ర పూజ చేస్తామని ఆమె తెలిపారు. రాజవంశానికి చెందిన ఎందరో వీరనారుల చరిత్రను చాటిచెప్పడానికి ఈ ఉత్సవాలను తోడ్పడుతున్నాయని అన్నారు.