నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 17న తిరుపతి లోక్సభ స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.