ఒరేయ్.. కోతి చేష్టలు చేయకురా.. అని సాధారణంగా అంటుంటాం. ఎవరైనా చిలిపి పనులు చేస్తే కోతితో ఎందుకు పోల్చుతాం అంటే.. కోతి చేష్టలు అలా ఉంటాయి కాబట్టి. కోతి ఒక్కచోట నిలకడగా ఉండదు. అటూ ఇటూ పరిగెత్తుతుంది. అక్కడా ఇక్కడా తిరిగి.. ఏది కనిపిస్తే.. దాన్ని పట్టుకోవడమో.. లేక దాన్ని పగులగొట్టడమో.. లేక విసిరేయడమో.. ఇలా.. అన్ని చేష్టలు వాటివి అలాగే ఉంటాయి. అందుకే.. కోతి చేష్టలు చేయకురా.. అని మనం ఎవరినైనా తిట్టాలనుకుంటే అలా తిడతాం.
తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కోతి.. జెండాను ఎగురవేస్తుంది. ఓ స్కూల్ బిల్డింగ్ ఎక్కిన కోతి.. జాతీయ జెండాను పట్టుకొని ఎగురవేసి.. దానిలో ఉన్న పువ్వులను కూడా కిందికి దులుపేస్తుంది. కోతి జెండా ఎగురవేస్తుంటే.. అక్కడున్న వాళ్లు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోను గిడ్డ కంపెనీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.