సెలబ్రిటీలకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే వెకేషన్ కు చెక్కేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు వెకేషన్ కు వెళ్లిపోతారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తన భర్త షాహిద్ తో కలిసి మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తోంది.
మాల్దీవుల్లో తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది మీరా. బీచ్ లో సూర్యనమస్కార్ చేస్తూ ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది మీరా. అలాగే.. మాల్దీవుల్లో దిగిన మరికొన్ని ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
భర్తతో వెకేషన్ కు వెళ్లినా కూడా తన ఫిట్ నెస్ ను మాత్రం మీరా మరిచిపోలేదు అంటూ తన యోగా వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తను సూర్యనమస్కార్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.