లండన్ : స్పైడర్‌మ్యాన్ డ్రస్‌లో ఓ వ్యక్తి సూపర్ మార్కెట్లో నానా హంగామా సృష్టించాడు. సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. లండన్‌లోని అస్ధ సూపర్ మార్కెట్లో హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పైడర్‌మ్యాన్ డ్రెస్‌లో వచ్చిన ఈ వ్యక్తి అక్కడి మహిళా సిబ్బంది ముఖంపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సూపర్ మార్కెట్ లోపల తీసిన ఈ వీడియోలో వ్యక్తి తనకు ఎదురుపడిన వారిపై పంచ్‌లతో విరుచుకుపడుతూ దొరికిన వస్తువులను విసిరివేయడంతో షాపింగ్‌కు వచ్చిన కస్టమర్లు బెంబేలెత్తారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. సిబ్బందిని, కస్టమర్లను అకారణంగా కొడుతూ బీభత్సం సృష్టించాడు. పోలీసులు ఎట్టకేలకు స్పైడర్‌మ్యాన్‌ను అరెస్ట్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు నిరోధించేందుకు పార్లమెంట్ కఠిన చట్టాలు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.