కవలలు అందరికీ పుట్టరు. కొందరికే జన్మిస్తారు. అందులోనూ నూటికి 99 మంది కవలలు ఒకే రూపంలో ఉంటారు. అటువంటి కవలలను ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. వాళ్లను చూసినప్పుడల్లా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే… ప్రపంచంలోనే అత్యంత వయసు మళ్లిన వృద్ధ కవల జంట వయసు ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
జపాన్‌కు చెందిన ఐడెంటికల్ ట్విన్స్ ఉమెనో సుమియామా, కౌమె కొడమా అనే ఇద్దరు మహిళలు ప్రపంచంలో అత్యంత వృద్ధ కవలలుగా రికార్డుకెక్కారు. ప్రస్తుతం వారి వయసు 107 ఏళ్లు. ఇప్పటికీ ఇద్దరూ బతికే ఉన్నారు. అందుకే.. వాళ్ల పేర్లను గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదు చేశారు.
1953, నవంబర్ 5న వీళ్లు వెస్టర్న్ జపాన్‌లోని శోదోషిమా ఐలాండ్‌లో జన్మించారు. 11 మంది పిల్లల్లో ఈ జంట ఒకటి. చిన్నవయసులోనే ఇద్దరూ విడిపోయారు. కొడమా ఓయిటాకు వెళ్లిపోయి అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. సుమియామా మాత్రం శోదోషిమా ఐలాండ్‌లోనే ఉండిపోయింది. తమకు 70 ఏళ్లు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి కొన్నేళ్ల పాటు తీర్థయాత్రలు కూడా చేశారు.
ప్రస్తుతం వీరి వయసు 107 ఏళ్ల 300 రోజులు. ఇదివరకు జపాన్‌కే చెందిన కిన్ నారిట, జిన్ కానియె అనే ఇద్దరు వృద్ధ మహిళల మీద ఉన్న రికార్డును వీళ్లు చెరిపేసి.. ఆ రికార్డును వీళ్లు క్రియేట్ చేశారు. వాళ్ల పేరు మీద 107 సంవత్సరాల 175 రోజుల రికార్డు ఉండేది. దాన్ని వీళ్లు బ్రేక్ చేసినట్టు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
eBaby : ఆన్లైన్లో వీర్యాన్ని ఆర్డర్ చేసి ఇన్సెమినేషన్ ద్వారా ఈబేబీకి జన్మనిచ్చిన మహిళ
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
1971 ఎంత స్పెషలో ! ఒక్క ఏడాదిలోనే ఎన్నెన్ని అద్భుతాలో !!