నెట్‌ఫ్లిక్స్ చూసేవారికి.. మనీ మనీ హైస్ట్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ వెబ్‌సిరీస్‌కు ఇండియాలో ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా మనీ మనీ హైస్ట్ సిరీస్‌కు చాలా పాపులారిటీ వచ్చింది. స్పానిష్కు చెందిన పాపులర్ షో అది. ఆ షో మొదటి సీజన్.. ఫస్ట్ ఎపిసోడ్ 2017లో విడుదల అయింది. అప్పటి నుంచి ఆ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఆ వెబ్ సిరీస్‌కు అవార్డల పంట పండింది. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్, ప్లాటినో అవార్డు.. ఇలా పలు అవార్డులను గెలుచుకున్న ఆ వెబ్‌సిరీస్ ఐదో, ఫైనల్ ఎపిసోడ్ త్వరలో విడుదల కానుంది.
ఇప్పటి వరకు విడుదలైన నాలుగు సీజన్లు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. త్వరలో విడుదల కాబోయే ఐదో ఎపిసోడ్ రెండు వాల్యూమ్స్‌లో రానుంది. ఒక్కో వాల్యూమ్‌లో ఐదు ఎపిపోడ్స్ ఉండనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో ఫైనల్ ఎపిసోడ్ వాల్యూమ్ 1.. సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. వాల్యూమ్ 2.. డిసెంబర్ 3, 2021 న రిలీజ్ కానుంది. అయితే.. వాల్యూమ్ 1 ఐదు ఎపిసోడ్స్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతాయి.
ఈనేపథ్యంలో.. జైపూర్‌కు చెందిన వెర్వె లాజిక్ అనే ఓ కంపెనీ.. తమ కంపెనీ ఉద్యోగులకు సెప్టెంబర్ 3న హాలీడే ప్రకటించింది. దానికి Netflix and Chill Holiday అనే పేరు పెట్టింది.
కంపెనీ సీఈవో అభిషేక్ జైన్.. తన కంపెనీ ఉద్యోగులందరికీ.. మెయిల్ పంపించి.. దాంట్లో సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ హాలీడే.. ప్రకటించారు.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కూడా ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేశారు. అంత కష్టపడి పనిచేసినందుకు.. ఒక్క రోజు చిల్ అవడం తప్పేం కాదు. అప్పుడప్పుడు పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు బ్రేక్స్ తీసుకోవాలి. కాకమ్మ కథలు చెప్పి.. లీవ్స్ తీసుకునే మెయిల్స్, లీవ్ తీసుకోవడం కోసం చెప్పే అబద్ధాల మెయిల్స్, ఇతరత్రా కారణాలు చెప్పి లీవ్ కోసం వచ్చే మెయిల్స్, మాస్ బంక్స్.. వీటన్నింటి నుంచి తప్పించుకొని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటే.. ఈ బ్రేక్ చాలా అవసరం. అంటూ.. ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు.. ఏం చేయాలో.. ఏ సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి సిరీస్ చూడటం స్టార్ట్ చేయాలో కూడా చెప్పుకొచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ టాస్క్ లిస్ట్ అంటూ టైమ్ టైబుల్తో సహా.. ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం