గులాబ్ జామున్.. పేరు వినగానే నోరూరుతుంది కదా. నోట్లో వేసుకుంటే చాలు. దాని టేస్టే వేరు. గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉండని వాళ్లు చాలా తక్కువ. గులాబ్ జామున్ ను చూసి నోటిని కంట్రోల్ చేసుకోవడం చాలామంది వల్ల కాదు. పిల్లలు కూడా లాగించేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో.. ఫంక్షన్లలో గులాబ్ జామున్ ను ఖచ్చితంగా పెడతారు. తిండి ప్రియులు అయితే.. గులాబ్ జామున్లను లాగిస్తూనే ఉంటారు.
కానీ.. ఇప్పుడు మనం తెలుసుకునే గులాబ్ జామున్ చాలా డిఫరెంట్. మత్తెక్కిస్తుంది. దాన్ని నోట్లో వేసుకుంటే చాలు.. మత్తులో తూగాల్సిందే. ఈ గులాబ్ జామున్ అంటే మద్యం ప్రియులకు చాలా ఇష్టం. ఎందుకంటే.. అది ఆల్కాహాల్ తో ఇంజెక్ట్ చేసిన గులాబ్ జామున్. కిరిక్ అడ్డా.. అనే ఓ ఫేస్ బుక్ అకౌంట్ లో రీసెంట్ గా ఈ వీడియో అప్ లోడ్ అయింది.
అందులో.. గులాబ్ జామున్ లో ఓల్డ్ మంక్ రమ్ ను ఇంజెక్ట్ చేయడం చూడొచ్చు. అయినా.. మద్యాన్ని ఇలా తాగుతారా? మందుబాబుల ఐడియాకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. పైకి గులాబ్ జామున్ ల తింటూ.. హ్యాపీగా మద్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఆన్ ఐడియా సర్ జీ.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.