ఎవ్వరూ చేయలేని పని చేస్తే.. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అది ఏ పని అయినా.. ఈ ప్రపంచంలో ఇంకో వ్యక్తి చేయలేకపోతే.. లేదా అందరికంటే బెటర్‌గా ఎవరు చేస్తే వాళ్లు గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసినట్టు. ఇప్పటి వరకు ఎందరో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు.
ఒకరు అందరికంటే ఎక్కువ బిర్యానీ తిని రికార్డుకు ఎక్కితే.. ఇంకొకరు.. అందరి కంటే ఫాస్ట్‌గా వాటర్ తాగడమో లేదా జ్యూస్ తాగడమో.. కూల్‌డ్రింక్స్ తాగడమో చేస్తాడు. ఇంకొందరు పలు రకాల విన్యాసాలు చేసి, స్టంట్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదిస్తారు.
తాజాగా.. ఈ యువతి చూడండి.. ఒకే ఒక్క నిమిషంలో ఎన్ని డ్రెస్సులను మార్చిందో. ఒక్క నిమిషంలో కనీసం 65 డ్రెస్సులను మార్చి గిన్నిస్ రికార్డుకెక్కింది ఆ యువతి. ఒక వ్యక్తి తనను క్లోజ్‌గా ఉండే ఒక క్లాత్ లాంటి దాన్ని అడ్డం పెడుతూ.. పైకీ కిందికీ అంటూ ఉంటాడు. దాన్ని కిందికి అన్నప్పుడల్లా డ్రెస్ మారుతుంటుంది. గ్రాఫిక్స్‌లో కలర్స్ మార్చినంత ఈజీగా.. క్షణాల్లో ఆ యువతి.. డ్రెస్‌ను మార్చుతుంటుంది. అలా.. ఒక్క నిమిషంలో ఎక్కువ డ్రెస్‌లను మార్చుకొని ఆ యువతి.. గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆ వీడియోను తమ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇంతకీ ఆ యువతి.. అన్ని డ్రెస్సులను అంత ఫాస్ట్‌గా ఎలా మార్చిందంటారు. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి నోరెళ్లబెడుతున్నారు.