e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Fire Therapy : మంట‌ల్లో కాల్చిన సూదుల‌తో థెర‌పీ.. రోగాల‌న్నీ మ‌టుమాయం కావాల్సిందే

Fire Therapy : మంట‌ల్లో కాల్చిన సూదుల‌తో థెర‌పీ.. రోగాల‌న్నీ మ‌టుమాయం కావాల్సిందే

ఎవ‌రికైనా అనారోగ్యం వ‌స్తే.. ఏం చేస్తారు. ఎవ‌రైనా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. మామూలు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు లాంటివి వ‌చ్చినా.. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిందే. డాక్ట‌ర్ యాంటి బ‌యాటిక్స్ ఇచ్చి కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే త‌గ్గుతుంద‌ని చెబుతాడు. ఈరోజుల్లో ఎక్కువ‌మంది న‌మ్మేది అల్లోప‌తినే. అంటే ఇంగ్లీష్ మందులు.

అల్లోప‌తి అనేది మ‌న దేశంలోకి రాక‌ముందు చాలామంది శాస్త్రీయ విధానంలో వైద్యం చేసేవారు. ఆయుర్వేదం, హోమియోప‌తి ప‌ద్ధ‌తుల్లో ఇప్ప‌టికీ వైద్యం చేస్తున్నారు. అయితే.. ఇవేమీ కాకుండా.. ఒక కొత్త థెర‌పీ అందుబాటులోకి వ‌చ్చింది.

- Advertisement -

ఆ ట్రీట్‌మెంట్ ఎక్క‌డ ఇస్తారో తెలుసా? చైనాలో.. అవును.. చైనా.. అటువంటి థెర‌పీల‌కు పెట్టింది పేరు. తాజాగా ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసేందుకు చైనీయులు ఉప‌యోగించే ఫైర్ థెర‌పీ గురించి ప్ర‌స్తుతం అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

ఈ థెర‌పీ ద్వారా.. సూదుల‌ను బాగా వేడి చేసి.. ఆ సూదుల‌ను శ‌రీరం మీద ఉన్న ఆక్యుపంక్ష‌ర్ పాయింట్ల మీద గుచ్చుతారు. ఇదే విధానం ద్వారా కొన్ని క‌ప్స్‌ను తీసుకొని శ‌రీరం మీద ఉన్న పాయింట్స్ మీద వాటిని ఫిక్స్ చేస్తారు. ఈ థెర‌పీ ద్వారా చాలా ర‌కాల వ్యాధుల‌కు చెక్ పెట్టొచ్చ‌ని చైనీస్‌కు చెందిన థెరపీ నిపుణులు చెబుతున్నారు.

భుజాల నొప్పి, రూమ‌టాయిడ్, ఆర్థ‌రైటిస్‌, స్పాంటిలాసిస్‌, జాయింట్ స్ప్రేన్స్‌, క‌ణతులు, గైన‌కాల‌జీ స‌మ‌స్య‌లు, ఆండ్రాల‌జీ, జీర్ణ‌సంబంధ స‌మ‌స్య‌లు ఈ థెర‌పీతో న‌యం అవుతాయి.

ఈ ట్రీట్‌మెంట్‌ను చైనీస్‌లో క్యి, చి అని అంటారు. చైనాతో పాటు ఆక్లాండ్‌, ఈజిప్ల్‌లో కూడా ఇటువంటి థెర‌పీని నిర్వ‌హిస్తున్నారు.

ఫైర్ థెర‌పీలో భాగంగా.. సూదులు కాకుండా.. మ‌రో విధంగా కూడా ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. కొంచెం ఆల్కాహాల్‌ను తీసుకొని.. ఒక త‌డి ట‌వ‌ల్‌లో పోసి.. దానికి మంట అంటించి.. పేషెంట్ చ‌ర్మం మొత్తాన్ని ఆ మంట‌తో రుద్దుతారు. దాని వ‌ల్ల‌.. శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ని.. దాని వ‌ల్ల ఎన్నో రోగాలు న‌యం అవుతాయ‌ని చైనాకు చెందిన ఓ హెర్బ‌ల్ మెడిసిన్ కంపెనీ సీఈవో కౌన్ జియాన్ తెలిపారు.

మంట‌తో ఉన్న ట‌వల్‌ను చ‌ర్మంపై రుద్ద‌డానికి ముందే.. బాడీ మొత్తం హెర్బ‌ల్ పేస్ట్ రాస్తారు. ఆ త‌ర్వాత శ‌రీరం మొత్తం మంట ఉన్న ట‌వ‌ల్‌ను రుద్దుతారు. అంత‌కుముందే ఆక్యుపంక్ష‌ర్ పాయింట్ వ‌ద్ద వేడి సూదిని గుచ్చి ఉంచితే.. దాంట్లో నుంచి శ‌రీరంలో ఉత్ప‌త్తి అయిన వేడి మొత్తం బ‌య‌టికి వెళ్లిపోతుంది.

అయితే.. ఈ థెర‌పీ వ‌ల్ల నూటికి నూరు శాతం ఆయా వ్యాధులు న‌యం అవుతాయ‌ని చెప్ప‌డానికి శాస్త్రీయ ఆధారాలు అయితే ఇప్ప‌టి వ‌ర‌కు లేవు. కానీ.. చాలామంది చైనీయులు మాత్రం ఈ థెర‌పీపై ఆస‌క్తి చూపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

దైవాన్ని చేరుకోవ‌డానికి ఈ తొమ్మిది మార్గాలు ఎంతో కీల‌కం.. అవేంటో తెలుసా

చివ‌రి నిమిషంలో ఫుడ్ ఆర్డ‌ర్ చేశాడు.. రెస్టారెంట్ ఏం డెలివ‌రీ చేసిందో తెలుసా?

జాబ్ కావాలి.. మెట్రో స్టేష‌న్ వ‌ద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?

పురిటి నొప్పులు వ‌స్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుప‌త్రికి వెళ్లి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఎంపీ

Monkey Festival : అక్క‌డ కోతుల పండుగే స్పెష‌ల్ అట్రాక్ష‌న్.. ఎందుకు జ‌రుపుతారో తెలుసా?

ఇప్ప‌టికీ ఎయిర్‌పోర్ట్‌లు లేని దేశాలు ఉన్నాయ‌ని తెలుసా?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement