చేతిలో సర్జికల్ మాస్క్.. పక్కన సిరంజి.. వ్యాక్సిన్ బుడ్డిపై కొలువుదీరిన గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని 9వ డివిజన్ సుధానగర్లో కొవిడ్-19 వ్యాక్సిన్ గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు సైతం గణనాథుడి పక్కన కొలువుదీరారు.
– హనుమకొండ చౌరస్తా