టీవీ రిపోర్టర్ల బాధలు వర్ణణాతీతం. లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. లేదంటే.. లైవ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అందుకే.. లైవ్ ఇచ్చేటప్పుడు ఎటువంటి అడ్డంకులు లేని ప్రదేశానికి వెళ్లి లైవ్ ఇస్తుంటారు. కానీ.. లైవ్ మధ్యలో సడెన్‌గా కొన్ని అడ్డంకులు ఒక్కోసారి వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ లైవ్ రిపోర్టర్‌కు అదే అనుభవం ఎదురైంది. యూఎస్‌లోని ఇల్లినాయిస్ స్టేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ టీవీ చానెల్‌కు చెందిన రిపోర్టర్ స్థానికంగా ఉన్న ఓ సరస్సు దగ్గరికి వెళ్లి.. సరస్సు విశిష్టతను ప్రేక్షకులకు వివరిస్తున్నాడు. దాని కన్స్ట్రక్షన్ గురించి చెబుతున్నాడు. ఇంతలో అతడి వెనుక ఉన్న ఓ కారు.. నెమ్మదిగా సరస్సులోకి జారుకుంటూ వెళ్లి అందులో మునిగిపోయింది. కారు.. సరస్సులో మునిగిపోతున్న విషయాన్ని గమనించిన రిపోర్టర్.. తన లైవ్ కవరేజ్‌ను పక్కన పెట్టి.. కారు మునిగిపోయే దృశ్యాన్ని చిత్రీకరించాలంటూ.. తన కెమెరా పర్సన్‌కు చెబుతాడు. దీంతో.. కారు మునిగిపోయే దృశ్యాన్నే రికార్డు చేస్తారు. అయితే.. ఈ ఘటన జరిగింది జులై 29న. కానీ.. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను ప్రముఖ ఫుట్ బాల్ రైటర్ బ్రియన్ ఫ్లోయిడ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక.. ఆ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. అబ్బో.. మనోడు గొప్ప జర్నలిస్టు అవుతాడు. ఏ న్యూస్ జనాలు చూస్తారో.. వాళ్ల నాడిని బాగానే తెలుసుకున్నాడే.. అందుకే.. తన లైవ్‌ను ఆపేసి.. కారు మునిగిపోయే దృశ్యాన్ని చూపిస్తున్నాడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.