కరోనా వల్ల గత సంవత్సరం నుంచి లోకల్ బిజినెస్‌లు అన్నీ మూతపడ్డాయి. చిరు వ్యాపారుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ల బాధలు వర్ణణాతీతం. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. వల్ల కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.
అటువంటి వాళ్ల కోసం చిరు ప్రయత్నంగా ఓ మంచి పని చేసింది కాడ్బరీ కంపెనీ. తన కంపెనీ కోసం కాకుండా.. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఒక ఏఐ టూల్‌ను తీసుకొచ్చింది. ఆ టూల్‌తో షారుఖ్ ఖాన్‌ను చిరు వ్యాపారులు తమ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవచ్చు.
దాని కోసం క్యాడ్బరీ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి కస్టమ్ యాడ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో షారుఖ్ ఖాన్ ఫేస్, వాయిస్‌తో తమ బిజినెస్‌కు సంబంధించిన యాడ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
notjustacadburyad.com వెబ్సైట్లోకి వెళ్లి అది ఏ బిజినెస్ అయినా సరే.. తన వంతుగా కాడ్బరీ కంపెనీ చిరు వ్యాపారులకు చేస్తున్న సాయంగా కంపెనీ ప్రకటించింది. షారుఖ్ ఖాన్ ఫేస్, వాయిస్ కోసం కాడ్బరీ మిషన్ లర్నింగ్, ఏఐ టెక్నాలజీని ఉపయోగించింది. ఫ్రీ యాడ్‌కు సంబంధించిన వీడియోను కూడా కాడ్బరీ తాజాగా రిలీజ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mumbai Local Train : రన్నింగ్ ట్రెయిన్ ఎక్కబోతూ కిందపడిన మహిళ.. వైరల్ వీడియో
Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని