న్యూఢిల్లీ : మన సంప్రదాయ వివాహ వేడుకలంటేనే బంధుమిత్రుల కోలాహలం, సందడితో వినోదభరితంగా ఉంటాయి. పెండ్లి మంటపంపై పెండ్లికూతురును సరదాగా ఆటపట్టించేందుకు వరుడి స్నేహితులు, కజిన్స్ గమ్మత్తైన గిఫ్ట్ అందించగా అది చూసి నవ వధువు షాక్‌కు గురైంది. ముఖం కందగడ్డలా మారడంతో పాటు ఆ బహుమతిని నేలకు విసిరికొట్టింది.
ఇంతకీ వాళ్లు ఇచ్చిన బహుమతి ఏంటంటే పసిపిల్లలకు పాలు పట్టే బాటిల్‌ను ప్యాక్ చేసి ఇచ్చారు. ప్యాకెట్ విప్పిచూడగానే అందరూ నవ్వుతుండగా చిర్రెత్తుకొచ్చిన ఆమె బహుమతిని చూసి కంగుతింది. వెంటనే తేరుకున్న ఆమె ఆ బహుమతిని నేలపై విసిరికొట్టింది. ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.