ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవలే తెలంగాణలో బుల్లెట్టు బండి పాటకు పెళ్లికూతురు వేసిన డ్యాన్స్ వీడియో ఎలా వైరల్ అయిందో అందరికీ తెలుసు. తాజాగా తన పెళ్లిలో పెళ్లికూతురు.. తన తండ్రితో హుషారుగా వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పెళ్లి సంగీత్‌లో పెళ్లికూతురు.. తన తండ్రితో కలిసి డ్యాన్స్ వేసి పెళ్లికొచ్చిన అతిథులు ఫిదా అయ్యేలా చేసింది. తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కూతురును ఓ ఇంటిదాన్ని చేయాలని తండ్రి పడే తపన మామూలుగా ఉండదు. ఈనేపథ్యంలో తండ్రీకూతురు ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయడం అది.. కూడా పెళ్లి కూతురు హుషారుగా నవ్వుతూ డ్యాన్స్ వేయడం ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను వెడ్‌గోఈజీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అయితే.. ఆ వీడియో గత సంవత్సరం డిసెంబర్లో పోస్ట్ అయినప్పటికీ.. తాజాగా లైమ్‌లైట్‌లోకి వచ్చి సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది.