ఆనంద్ మహీంద్రా.. ఒక బిజినెస్ టైకూన్. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్. అంతే కాదు.. ఆయన సోషల్ సర్వీస్‌లో ఎంతో ముందుంటారు. ఆయన ఇప్పటిక వరకు ఎందరికో దారి చూపించారు. కష్టాల్లో ఉన్నవాళ్లు తనకు ట్వీట్ చేస్తే తనకు తోచిన సాయం చేస్తారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. సమకాలీన అంశాలపై ట్వీట్లు చేస్తుంటారు. పోస్టులు చేస్తుంటారు. ఫన్నీ వీడియోలు, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆ వీడియోలు.. అన్నీ పోస్టు చేస్తారు.
తాజాగా ఆనంద్ మహీంద్రా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక దినసరి కూలీ ఇటుకలు మోస్తుంటాడు. సాధారణంగా.. ఏ కూలీ అయినా ఒకసారి ఓ 10 ఇటుకల వరకు మోస్తారని అనుకుందాం. కానీ.. ఈ కూలీ మాత్రం.. ఏకంగా 30కి పైగా నెత్తి మీద మోస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ వీడియో చూసి ఆనంద్ మహీంద్రా కూడా షాక్ అయ్యారు.
అంత రిస్క్ చేసి ఎవ్వరూ కూలీ పని చేయాలనుకోరు. కానీ.. ఈ వ్యక్తి మాత్రం తన కష్టం తెలియకుండా.. ఒక కళలా ఇటుకలు పేర్చుతూ.. పని చేస్తున్నాడు. ఇది ఎక్కడో ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. వాళ్లకు ఆటోమెషన్ అమలు చేయొచ్చు కదా.. ఇంతకీ.. అతడి గొప్ప స్కిల్స్‌ను కంపెనీ గుర్తించిందా? లేదా? అంటూ ఆనంద్ ట్వీట్ చేస్తూ ఆ వీడియోను జత చేశారు.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. దాన్ని వైరల్ చేయడమే కాకుండా.. ఆటోమెషన్ చేస్తే ఉన్న పని కూడా పోతుంది కదా సార్.. దినసరి కూలీకి ఇది కామనే. మహిళలు కూడా అంతే బరువును మోస్తారు. సార్.. అది మన దగ్గరి వీడియో కాదు సార్. ఆఫ్రికాలో జరిగింది.. అంటూ ఎవరికి వారు.. వాళ్లకు తోచిన కామెంట్లను చేస్తున్నారు.