మంగళవారం 26 మే 2020
Tourism - May 07, 2020 , 21:44:25

గ్రీన్‌జోన్ ట్యాగ్‌తో గోవా టూరిజం కోలుకుంటుంది...

గ్రీన్‌జోన్ ట్యాగ్‌తో గోవా టూరిజం కోలుకుంటుంది...

ప‌నాజీ:  కోవిడ్ - 19 కేసులు అతి త‌క్కువ న‌మోదు కావ‌డంతో గోవా రాష్ట్రం గ్రీన్ జోన్‌గా ఉంది. ఈ ట్యాగ్‌తో గోవా టూరిజం వేగంగా పున‌రుద్ధ‌రించ‌బ‌డుతుంద‌ని కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీస్‌(సీసీఐ) తెలిపింది. ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి అశోక్‌కుమార్ గోవా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌ట‌క శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మ‌హ‌మ్మార భ‌యం దాదాపుగా ముగింపులోకి వ‌చ్చింది. పోస్ట్ కోవిడ్‌-19 కాలంలో టూరిజం శాఖ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రావాల‌ని సూచించారు.

 గోవా గ్రీన్‌జోన్ కాబ‌ట్టి ప‌ర్య‌ట‌క‌రంగం పున‌రుద్ధ‌ర‌ణ‌కు డిజిట‌ల్ ప్ర‌చారాన్ని ప్రారంభించాల‌ని గోవా టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ప్ర‌భుత్వంను అభ్య‌ర్థించింది. టూరిజం ప్ర‌చారం కోసం బ‌డ్జెట్ కేటాయించాల‌ని ప్ర‌తిపాదించింది. గోవా కోవిడ్ ర‌హిత రాష్ట్రంగా ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌ముఖంగా చూపించాల‌ని, అది టూరిస్టుల్లో విశ్వాసం పెంపొందిస్తుంద‌ని సీసీఐ సూచించింది.

 ప‌ర్యాట‌క రంగం పున‌రుద్ధ‌ర‌ణ‌కు మూడువిధానాలు రూపొందించుకోవాల‌ని తెలిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు, ప‌ర్యాట‌క అనుకూల విధానాలు, ముందు జాగ్ర‌త చ‌ర్య‌లు తీసుకోవ‌డం, ప‌ర్యాట‌క ప్రోత్సాహ‌కాలు రూపొందించుకోవాల‌ని సీసీఐ నిర్దేశించింది. య‌జ‌మానులు చాలా మంది ఉద్యోగుల‌కు వేత‌నాలు చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని తెలిపింది. ప‌ర్యాట‌క రంగానికి ఈ సంవ‌త్స‌రం లైసెన్స్ ఫీజు మాఫీ చేయాలి. లైసెన్స్ రెన్యూవ‌ల్‌ను ఒక సంవ‌త్స‌రం వ‌ర‌కు పొడ‌గించ‌లి. చాలా హోట‌ళ్లు ఖాళీగా ఉన్నాయి. జీఎస్టీ రేటును 12-18 శాతం నుంచి 5-6 శాతానికి త‌గ్గించాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. 


logo