మంగళవారం 26 మే 2020
Tourism - Apr 20, 2020 , 13:41:54

శ్రీనగర్‌లో తులిప్ పూల సోయగం

శ్రీనగర్‌లో తులిప్ పూల సోయగం

శ్రీన‌గ‌ర్‌లోని తులిప్‌తోట‌. ఆసియాలోనే అతిపెద్ద‌ది. క‌శ్మీర్ సౌంద‌ర్య‌మంతా శ్రీన‌గ‌ర్‌లో ఇమిడిఉంటే..ఆ న‌గ‌ర సోయగం అక్క‌డ విరిసే పూల‌ల్లో దాగిఉంటుంది. ఇక్క‌డ రంగురంగుల పూలు  ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, పుడమి రంగుల తివాచీగా మారినట్లు తోస్తుంది. ప్రకృతి అందాలకు కేరాఫ్ గా ఉంటుంది తులిప్ తోట‌. పదిహేను హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు నిలువెల్లా కనులున్నా చాలవు. హిమసరస్సులాంటి డాల్ లేక్ తీరాన ఉన్న ఈ సుందర ఉద్యానవనంలో ఎన్నెన్నో రకాల పుష్పాలు వసంత శోభను వెదజల్లుతున్నాయి. తోట మొత్తం పూల తివాచీ పరిచినట్లు...  చూడగానే హృయదానికి అత్తుకుంటుంది. పదిహేను లక్షలకు పైగా సుమాలు విరబూసాయి.

అయితే ఆ పూల సౌంద‌ర్యాల‌ను చూసేందుకు  ప్ర‌తి ఏటా ఏప్రిల్‌లో తులిప్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. ఈ సీజ‌న్‌లో అక్క‌డ ప‌ర్యాట‌కుల సంద‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దేశ‌, విదేశాల నుంచి భారీగా త‌ర‌లివ‌స్తారు. ఈసారి శ్రీనగర్‌లో తులిప్ పూలు బాగా వికసించాయి. ఐతే... కరోనా లాక్‌డౌన్ కారణంగా... సందర్శకులను అనుమతించట్లేదు.ఈ సంవత్సరం సబర్బన్ కొండల్లోని దాల్ సరస్సు ఒడ్డున తులిప్ పువ్వులు వివిధ రంగులలో వికసించడాన్ని ఎవరూ చూడట్లేదు.వివిధ రకాలగా... వివిధ రంగుల్లో 13 లక్షలకు పైగా తులిప్ పువ్వులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువగా 13 లక్షల పువ్వులు వికసించాయి. తోట గుండా ప్రవహించే కాలువ సందర్శకులకు మధురానుభూతిని కలిగిస్తుంది. పర్యాటకులే కాదు, స్థానికులు కూడా ఈ సంవత్సరం తులిప్ తోటల్ని చూడలేకపోతున్నారు. లాక్‌డౌన్ తర్వాత సందర్శకులు వచ్చే ఛాన్స్ ఉండటంతో తోటల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికైనా సరే తులిప్ తోటల్ని చూస్తే... మానసిక ఆహ్లాదం కలగకమానదు.logo