శనివారం 05 డిసెంబర్ 2020
Tourism - Jun 08, 2020 , 15:12:04

విహారయాత్రకు సిద్ధమా.. జర జాగ్రత్త!

విహారయాత్రకు సిద్ధమా.. జర జాగ్రత్త!

విహారం అందులోనూ వానాకాలపు ప్రయాణం. చాలా జాగ్రత్తలతో కూడుకున్నది. ప్రణాళికపరంగా ఎంపిక చేసుకుంటే మంచిది. మనం వెళ్లే ప్రాంతాల గురించి అక్కడి ఆహార పదార్థాలు, వాతావరణ స్థితిగతులు ముందే తెలుసుకుంటే విహారయాత్ర సుఖవంతంగా ఉంటుంది.

వానకాలంలో పర్యాటానికి వెళ్లాలనుకునేవారు ట్రావెల్‌బ్యాగ్‌లో దుస్తులతోపాటు వాటర్ బాటిళ్లు, మందులు, కెమెరా, టూర్ మ్యాప్ తప్పనిసరిగా ఉండాలి. టూరుకు వెళ్ళేవారు ముందుగా దుస్తు లు, ఇతర వస్తువులు సక్రమంగా సర్దుకోవాలి. తక్కువ బరువు, ఎక్కువ వస్తువులు పట్టే లేటెస్టు బ్యాగులు తీసుకుంటే మంచిది. వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. అందుకే వాటర్ బాటిల్‌ తీసుకెళ్లడం ఉత్తమం. ఇంకా కెమెరా, డైరీ, ప్లాస్క్, మెడికల్ కిట్, టూర్ మ్యాప్ వెంట ఉంచుకోవాలి. వర్షాకాలంలో రెయిన్‌కోట్లు తప్పనిసరి. షూ వేసుకుంటే తడిసి ఆరకపోవడం వల్ల వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పులు బెటర్. రాత్రిపూట చలివేయకుండా బెడ్‌షీట్లు కూడా అవసరమే. స్మార్ట్, ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లు తమ వెంట తీసుకెళ్తే అందులోని నేవిగేషన్ యాప్ ద్వారా గమ్యాన్ని చేరుకోవచ్చు. తెలియని ప్రదేశానికి వెళ్లాలన్నా ఈయాప్ ఎంతో ఉపయోగపడుతుంది. వెళ్ళాల్సిన ప్రదేశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. టూర్‌ ఎన్నిరోజులు ఉంటుందో అన్నిరోజులకు సరిపడా దుస్తులు తీసుకెళ్ళాలి. ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందులు మాత్రం తప్పవు.