మంగళవారం 01 డిసెంబర్ 2020
Tourism - Jun 05, 2020 , 17:34:33

24 గంటల్లో ఇంటి నిర్మాణం!

24 గంటల్లో ఇంటి నిర్మాణం!

ఒక ఇల్లు కట్టాలంటే నెలలు గడుస్తాయి. సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక గ్రామ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది? కొన్ని సంవత్సరాలు.

లాటిన్ అమెరికాలో నిర్మిస్తున్న త్రీడీ గ్రామం ఇది. కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఒక భవనాన్ని నిర్మించి ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేస్తున్నారు. ఊరంతా ఒకే ఆకారంలో ఉన్న ఇండ్లను నిర్మిస్తున్నారు. 50 కుటుంబాలు ఈ గ్రామంలో నివసించనున్నాయి. ఐకాన్ అనే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కనీస వసతి లేని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చక్కగా జరగకపోవడం, ఇబ్బందులు ఎదురవడం వల్ల పరిష్కార మార్గంగా త్రీడీ ఇండ్ల నిర్మాణ ఆలోచన పుట్టింది. నీరు, కరంట్, కూలీల వసతి దొరకకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యం అవడమే కాకుండా, ఖర్చు కూడా పెరుగుతుంది. అది తగ్గించేందుకు ఇది పనికొస్తుంది. ప్రతి ఇంటికి బయటవైపు కిచెన్‌రూమ్, చుట్టూ కూరగాయలు పండించడానికి స్థలం కూడా ఉంటుంది. ఈ ఆలోచన వల్ల గృహ నిర్మాణ రంగంలో కీలకంగా మార్పులు రానున్నాయి. రెండు వందల డాలర్ల పెట్టుబడి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ త్రీడీ ఇండ్లతో కూడిన గ్రామాలు పర్యాటక ప్రదేశాలుగా మారుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్కదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు వచ్చి త్రీడీ గ్రామాన్ని సందర్శిస్తున్నారు.