శుక్రవారం 30 అక్టోబర్ 2020
Tourism - Sep 07, 2020 , 16:08:05

'ది హ్యాపీనెస్ మ్యూజియం'.. చూసొద్దామా!

'ది హ్యాపీనెస్ మ్యూజియం'.. చూసొద్దామా!

కోపెన్‌హాగన్ : మ్యూజియం.. చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాలు సంరక్షించబడే ప్రదేశం. కానీ, 'ది హ్యాపీనెస్ మ్యూజియం' గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రజలను సంతోషపెట్టే లక్ష్యంతో ప్రారంభించిందే ఈ 'ది హ్యాపీనెస్ మ్యూజియం'. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఈ మ్యూజియం ఉంది. 

కోపెన్‌హాగన్ లోని హ్యాపీనెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిని ఏర్పాటుచేసింది. హ్యాపీనెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో మైక్ వైకింగ్.. హ్యాపీనెస్ గురించి మూడు పుస్తకాలు రాశారు. ది లిటిల్ బుక్ ఆఫ్ లెజ్ (లెజ్ అనగా హ్యాపీనెస్), ది లిటిల్ బుక్ ఆఫ్ హుఘ్ (హుఘే అనగా ఫన్), ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మెమోరీస్.. హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి. ప్రపంచంలోని మొట్టమొదటి ఈ తరహా మ్యూజియంలో ఈ ఎనిమిది గదులున్నాయి. 18 వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రాత్మక భవనం యొక్క నేలమాళిగలో ఏర్పాటుచేయబడింది. ఈ మ్యూజియంలోని ప్రతి గది చాలా ప్రత్యేకమైనది. ప్రతి గదిలో మీరు ఆనందం యొక్క విభిన్న అభిప్రాయాలకు గురవుతారు. కొన్ని ప్రయోగాలు కూడా చేస్తారు. 

ఒక విభాగం ఆనందం యొక్క శాస్త్రం గురించి మాట్లాడుతుంది. మరో విభాగం 2000 సంవత్సరాల చరిత్ర గురించి చెప్తుంది. ఆనందం యొక్క భవిష్యత్ చెప్పే ఇంకొక విభాగం కూడా ఉన్నది. ఒక విభాగం చిరునవ్వు కోసం ప్రత్యేకంగా ఉన్నది. ఇందులో ఏర్పాటుచేసిన మోనాలిసా ఫొటోలో వివిధ కోణాల నుంచి ఆమె చిరునవ్వును చూడవచ్చు. 

వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆనందాన్నిచ్చే క్షణాలు కూడా ఇక్కడ సేవ్ చేసిన గది ఉంది. ప్రజలు ఈ క్షణాలను ఈ మ్యూజియంలోనే పంచుకున్నారు. ఒక విభాగంలో హ్యాపీనెస్ ల్యాబ్ ఉంది. మన మనసుకు మంచి అనుభూతి ఎలా వస్తుందో చెప్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మే నెల నుంచి మూసివేసి ఉంచి.. జూలై 14 నుంచి ప్రజల సందర్శనార్థం తెరిచారు. కఠినమైన ప్రొటోకాల్‌ మధ్య మ్యూజియంను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 50 మందిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మీరూ ఈ మ్యూజియంను ఒకసారి సందర్శించి మీ హ్యాపీనెస్ ను మరింత పెంచుకోండి.