బుధవారం 30 సెప్టెంబర్ 2020
Tourism - Sep 07, 2020 , 15:30:00

21 నుంచి తెరుచుకోనున్న తాజ్ మహల్

21 నుంచి తెరుచుకోనున్న తాజ్ మహల్

లక్నో : అన్ లాక్ 4 మార్గదర్శకాల మేరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలైన తాజ్ మహల్, ఆగ్రా కోట ప్రజల సందర్శనకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 21 నుంచి ఈ రెండు పర్యాటక క్షేత్రాలలో పర్యాటకులను అనుమతించనున్నారు.

దేశంలో కరోనా మహమ్మారి ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తుండగా, ప్రభుత్వాలు పరిస్థితిని సాధారణం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మార్చి 17 నుంచి పర్యాటకులకు అనుమతి నిలిపివేసిన తాజ్ మహల్, ఆగ్రా కోట ఈ నెల 21 నుంచి తెరుచుకుంటున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని వెల్లడించింది. జిల్లాలోని ఇతర స్మారక చిహ్నాలు సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభించబడ్డాయి, అయితే ఆగ్రా కోట, తాజ్ మహల్ మాత్రం కరోనా సంక్రమణ కారణంగా తెరవలేదు. ఒక రోజులో గరిష్టంగా 5,000 మంది పర్యాటకులు తాజ్ మహల్, ఆగ్రా కోటలో రోజుకు గరిష్టంగా 2,500 మంది పర్యాటకులు ప్రవేశానికి వస్తుంటారు. ఇన్నిరోజుల పాటు తాజ్ మహల్ మొదటిసారి మూసివేశారు.


logo