మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Tourism - Sep 08, 2020 , 07:21:05

ఈ నెల 21 నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అనుమతి

ఈ నెల 21 నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అనుమతి

ఆగ్రా : అన్‌లాక్‌ 4లో భాగంగా ఈ నెల 21 నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఏఎస్‌ఐ సూపరింటెండింగ్‌ పురావస్తు శాస్త్రవేత్త బసంత్‌కుమార్‌ తెలిపారు. రెండు ప్రాంతాల్లో ఒకే రోజు వరుసగా ఐదువేలు, 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా టికెట్‌ కౌంటర్లు తెరువడం లేదని, సందర్శకులకు ఎలక్ట్రానిక్‌ టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.  పర్యాటకులంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. మాస్క్‌లు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంలో మార్చిలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూతపడ్డ తాజ్‌మహల్‌, ఆగ్రా పోర్ట్‌ దాదాపు ఆరు నెలల తర్వాత పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతి ఇస్తున్నారు. కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం 61,625 యాక్టివ్‌ కేసులు ఉండగా, వైరస్‌ ప్రభావంతో 3,920 మంది మృత్యువాతపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo