శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Tourism - Mar 16, 2020 , 18:21:55

ప్రకృతి అందాల పాండవుల గుట్టలు చూసొద్దాం

ప్రకృతి అందాల పాండవుల గుట్టలు చూసొద్దాం

అపురూప ప్రకృతి సౌందర్యానికి నిలయం పాండవుల గుట్టలు. అరకులోయ అందాలను తలపిస్తూ పర్యాటకులను మది దోచుకుంటు న్నాయి. ఈ గుట్టలు తెలంగాణ ప్రభుత్వ కాలంలో అభివృద్ధి చెందాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టూరిజం కారిడార్ రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నాటి ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలు ప్రతిపాదనలుగానే మిగిలాయి. ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ప్రచారం లభించలేదు.


అపురూపమైన ప్రకృతి సౌందర్యం.., పరవశం కలిగించే మనోహర దృశ్యాలను తన పొదిళ్లల్లో పదిలపర్చుకున్న పాండవుల గుట్టలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందాయి. ఎత్తయిన కొండలు, గహలు, పచ్చటి అటవీ ప్రాంతం, ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను ముగ్ధులను చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్ పని చేసిన శాలినిమిశ్రా 1998లో ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలను పర్యాటక రంగంలోకి తేవాలని సంకల్పించారు. వెంటనే ప్రతిపాదనలు రూపొందించి నాటి ప్రభుత్వానికి పంపారు.


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. రాష్ట్ర టూరిజం అధికారులు రేగొండలోని పాండవుల గుట్టలు, ఘనపురం మండలంలోని మైలారం, సున్నపుగుహలు, కోటగుళ్లు, వెంకట పురంలోని రామప్ప, గోవిందరావుపేటలోని లక్నవరం, వాజేడులోని బోగత జలపాతం, తాడ్వాయి మండలంలోని మేడారం, ఏటూరు నాగారంలోని అభయారణ్యాలను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేసేందకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాంతంలో కాకతీయ ఉత్సవాలను కూడా నిర్వహించారు. అప్పటి నుంచి పాండవుల గుట్టలకు నిధులు కేటాయించారు. దీంతో ఇక్కడ నీటి సౌకర్యం, గుట్టపైకి మెట్లు, పార్కు, హరిత హోటల్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు బస చేసేందకు కాటేజీలు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి. ఎకోటూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్ నిర్వహిస్తున్నా రు.

గుట్టలపై చిత్ర లేఖనం


పాండవుల కాలం నాటి చిత్రలేఖనం గుట్టలపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆనాటి పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ఎత్త యిన కొండలు, గుహలలో పాండవులు వనవాసం చేసినట్లుగా ఇక్కడ చిత్రలేఖనం తెలియజేస్తున్నది. ఆనాటి భాషలో వారి చరిత్రను గుట్టలపై చెక్కారు.


గుట్టలలో రాక్ క్లైంబింగ్


2017 నుంచి ఎకోటూరిజం, అటవీశాఖ ఆధ్వర్యంలో పాండవుల గుట్టలలో రాక్ రాఫెలింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గుట్టలలో రాక్ నిర్వహించడానికి ఎవరెస్టు శిఖరం అదిరోహించిన నిపుణులు ఈ గుట్టలను సందర్శించి, రాక్ అనువైన ప్రాంతంగా గుర్తించారు. 2017లో వరంగల్ అర్బన్ కలెక్టర్ సైతం ఇక్కడ రాక్ చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. ప్రతీ శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో ఈ కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలలో పాల్గొనే వారు రూ.400 చెల్లిస్తే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ గుట్టలలో జలపాతం కూడా ఉంది. ఈ జలపాతం వర్షాకాలం మొదలు దాదాపు ఆరు నెలలపాటుగా పోస్తుంది.పాండవుల వనవాస ప్రాంతంగా...