బుధవారం 30 సెప్టెంబర్ 2020
Tourism - Jul 08, 2020 , 14:43:43

అబ్బురపరిచే అందమైన జలపాతం

అబ్బురపరిచే అందమైన జలపాతం

లిమా : ఆస్వాదించే మనుసున్న వారికి ఏది చూసినా అందంగానే కనిపిస్తుంది. కొందరు మేఘాల్లో అందమైన చిత్రాలను వెతుక్కొంటుండగా.. మరికొందరు చెట్లలో జీవాలను చూసి ఆనందిస్తుంటారు. అయితే, పెరూలో ఉన్న జలపాతాన్ని చూస్తే అందమైన వధువు గుర్తుకొస్తుంది. పైనుంచి కిందికి జాలువారుతూ శ్వేతవర్ణం పెండ్లి ధుస్తులు ధరించి అందాలు ఆరబోస్తున్నట్లుగా కనిపిస్తుందీ జలపాతం. నామోరా పట్టణం కాజమార్కా సమీపంలోని అటవీప్రాంతంలో ఉన్నది.

అచ్చం పెన్సిల్ తో పచ్చని చెట్లు, కొండలపై గీసినట్లుగా కనిపిస్తుంది. మొదటిసారి చూసిన వాళ్లంతా ఆర్ట్ అని కొట్టిపారేస్తూ మళ్లీ మళ్లీ చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటారు. ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మనం అంతదూరం వెళ్లి చూడాలంటే చాలా కష్టపడాల్సిందే. అయితే, అంత కష్టపడకుండానే మీరూ ఇక్కడి వీడియోలో చూసి జలపాతం అందాలకు పరవశులు కండి.logo