మంగళవారం 26 మే 2020
Tourism - Apr 25, 2020 , 18:19:39

కొరియన్లతోపాటు గల్లంతైన నేపాలీ గైడ్ మృతదేహం లభ్యం

కొరియన్లతోపాటు గల్లంతైన నేపాలీ గైడ్ మృతదేహం లభ్యం

హైదరాబాద్: హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి మంచు ప్రవాహంలో గల్లంతైపోయిన దక్షిణ కొరియన్ల నేపాలీ గైడ్ మృతదేహం అన్వేషక బృందానికి లభించింది. పోలీసులు శనివారం ఈ సంగతి వెల్లడించారు. అన్నపూర్ణ శిఖరం వద్ద 10,600 అడుగుల ఎత్తులో కొండల మీద నుంచి కూలిన మంచు తాకిడికి గత జనవరి 17న ట్రెక్కింగ్ టీం ప్రమాదానికి గురైంది. తదనంతరం కురిసిన మంచు వల్ల వెదకడం కష్టమైపోయింది. గత  సుక్రవారం కొంత మంచు కరగడం వల్ల ఓ బ్యాగు బయటపడింది. ఆ చుట్టుపక్కల వెదికితే గైడ్ మృతదేహం దొరికిందని కస్కీ జిల్లా పోలీసు విభాగాధిపతి దన్‌బహాదూర్ కడ్కీ మీడియాకు తెలిపారు. అయితే దక్షిణ కొరియా పౌరుల కోసం మరింత అన్వేషణ కొనసాగించాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. మృతదేహాలు పిడఉన్నట్టుగా భావించే ప్రదేశంలో మంచు ఇంకా లోతుగా ఉందని వివిరంచారు. గత నెలరోజులుగా నేపాల్ కూడా కరోనా వ్యాప్తి వల్ల లాక్‌డౌన్‌లో ఉండడం కూడా అన్వేషణ సాగకపోవడానికి మరో కారణం. అన్నపూర్ణ శిఖరానికి ఏటా 1,70,000 మంది పర్యాటకులు, ట్రెక్కర్లు వస్తారు.


logo