శనివారం 30 మే 2020
Tourism - Mar 19, 2020 , 23:36:24

మహిమాన్వితం-రుద్రపాద క్షేత్రం

మహిమాన్వితం-రుద్రపాద క్షేత్రం

మంథని మండలం ఖానాపూర్‌ వద్ద ఉత్తర వాహిణిగా గోదావరి నది తన ప్రవాహాన్ని దిశను మార్చుకునే చోటనే చాళక్యులు, కాకతీయ రాజుల కాలం నాటి రుద్రపాద క్షేత్రం వెలసినట్లు ఇక్కడి రుద్రపాదాలకు అత్యంత ప్రాచుర్యం లభిస్తున్నది. రుద్ర క్షేత్రంలో గోదావరి నీట మునిగిన రుద్రపాదాలకు తోడు గోదావరికి ఎదురుగా నిలిచిన రుద్రేశ్వరుడు, రుద్రారాణి, నంది ఒక చోట, వాటి పక్కనే మహేశ్వరి, కొంత దూరంలో మహాత్రిపుర సుందరి, బాలత్రిపుర సుందరి, యోగిని శక్తి, త్రిమూర్తులు వలయాకారంలో కూర్చున్న అత్యద్భుతమైన శిల్పకళా సౌందర్యం కనువిందు చేస్తున్నది.

కాకతీయుల నాటి ఒక సుందరమైన గణపతి విగ్రహాన్ని, రుద్రేశ్వరుడు, రుద్రారాణి, నందిల వద్ద నిలిపారు. ఏనుగు, నంది, మొసలి, తోరణము లాంటివి మహాబలిపురంలో మాదిరిగా చెక్కబడి ఉన్నాయి. పూర్వపు ప్రాశస్థ్యాన్ని పరిశీలిస్తే కాళేశ్వర-ముక్తీశ్వర, శీలేశ్వరసిద్దేశ్వర, రుద్రేశ్వర-రుద్రారాణి, మహాలక్ష్మి, గోదావరి మాత విగ్రహాలు పెద్దవిగా ఔరంగాబాద్‌లోని ఎల్లోరా, మహాబలిపురంలో గంగావతరణ పర్వతం, మంత్రపురి మంథనిలోని సహస్ర లింగక్షేత్రము మాదిరిగా రుద్రపాద క్షేత్రం సైతం కొండపైనే ఆరుబయట వెలసి ఉండడంతో ఇక్కడ గోదావరి తీరం అత్యంత అందంగా కనిపిస్తున్నది. logo