మంగళవారం 07 జూలై 2020
Tourism - May 14, 2020 , 15:28:48

ప్రేమ సరస్సు... గూగుల్‌ మ్యాప్‌లో చూడొచ్చు...

ప్రేమ సరస్సు... గూగుల్‌ మ్యాప్‌లో చూడొచ్చు...

ప్రేమకు చిహ్నంగా టక్కున గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్‌. కానీ ప్రపంచంలో చాలా చోట్ల అన్వేషిస్తే అలాంటి అందమైన చిహ్నాలు మరిన్ని కనపడతాయి మనకు. తాజ్‌మహల్‌ తర్వాత అంత పెద్ద మానవ నిర్మిత ప్రేమ చిహ్నాలేవీ మనకు అంతగా తెలియదు. మానవ నిర్మిత ప్రేమ చిహ్నాల్లో ఈ మద్య కాలంలో ఆవిష్కరించబడ్డ వాటిల్లో  దుబాయ్‌లో ఓ గొప్ప నిర్మాణం ఉంది. అదే దుబాయ్‌లోని లవ్‌లేక్‌. 

దుబాయ్‌లో ఎక్కువగా ఉండేది ఎడారి మాత్రమే. అటువంటి ఎడారిలో ఏకంగా  ఓ మానవ నిర్మిత సరస్సును నిర్మించారు. ఏకంగా 5.5 లక్షల చదరపు మీటర్లలో రెండు ప్రేమ గుర్తులు కలిసినట్లుగా ఉండేలా ఈ సరస్సును నిర్మించారు. పక్కనే పెద్ద పెద్ద చెట్లతో ఆంగ్లంలో లవ్‌ అనే అక్షరాలు కనపడేలా ఏర్పాట్లు చేసారు. గూగుల్‌ మ్యాప్‌లో ఈ పూర్తి మానవ నిర్మిత అద్ముతాన్ని మనం చూడొచ్చు.

ఈ ఎడారి ప్రాంతంలో సరస్సు ప్రాంతలో మొత్తం 16 వేల చెట్లను పెంచుతున్నారు. దీంతో పాటు ఈ సరస్సు వద్ద 150 రకాల పక్షి జాతులను గమనించవచ్చు. గద్దలు, బాతులు, హంసలు, ఫాల్కన్‌లు ఇక్కడ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో అక్కడకు వచ్చే పర్యాటకులు, ప్రేమికులు మంచి అనుభూతిని పొందే అవకాశముంది.  


logo