అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!

వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక మంత్రిగా 74 ఏండ్ల వయసున్న జానెట్ యెల్లెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా సెనేట్ ఆమె పేరుకు ఆమోదముద్ర వేసింది. 231 సంవత్సరాల అమెరికన్ చరిత్రలో ఆర్థిక మంత్రి బాధ్యతను ఒక మహిళకు అప్పగించడం ఇదే మొదటిసారి. అయితే, జానెట్ యెల్లెన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై వైట్ హౌస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అమెరికా ఆర్థిక మంత్రి పదవికి జానెట్ యెల్లెన్ను, ఇండో-అమెరికన్ నీరా టాండన్‌ను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసినట్లు సమాచారం. వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. యెల్లెన్ నియామకాన్ని న్యూయార్క్ షేర్ మార్కెట్లు స్వాగతిస్తున్నాయి. యెల్లెన్ను ఆర్థిక మంత్రిగా నియమిస్తున్న వార్తలు రావడంతోనే షేర్లు ఊపందుకున్నాయి. తన ఆర్థిక ఎంజెండాకు ముఖ్య సలహాదారుగా, ప్రతినిధిగా ఉంటారని గతంలోనే బైడెన్ వెల్లడించారు.
ఎవరీ జానెట్ యెల్లెన్..?
అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యత స్వీకరించనున్న 74 ఏండ్ల వయసున్న జానెట్ యెలెన్.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలపై మంచి అవగాహన కలిగివున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అనంతరం అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని యెల్లెన్ పరిష్కరించగలదని ఆర్థిక పరిశీలకులు భావిస్తున్నారు. బైడెన్ ఆర్థిక విధానాలను రూపొందించడంలో, సలహాలు ఇవ్వడంలో యెల్లెన్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈమె బ్రూకింగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఈమె 2014 నుంచి 2018 వరకు ఫెడరల్ రిజర్వ్ అధిపతిగా ఉన్నారు. అంతకు ముందు 1997 నుంచి 1999 వరకు వైట్‌హౌస్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్‌గా సేవలందించారు. ఫెడరల్ రిజర్వ్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళ కూడా యెల్లెన్ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది.
పలువురు సెనేటర్ల మద్దతు
అమెరికా చరిత్రలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు పురుషుల ఆధిపత్యాన్ని కలిగి ఉన్నదని డెమోక్రాటిక్ సెనేటర్ డయాన్నే ఫెయిన్స్టెయిన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2014 లో ఫెడరల్ రిజర్వ్ అధ్యక్ష పదవిని నిర్వహించిన మొదటి మహిళ అని ఆమె పేర్కొన్నారు. అమెరికా ద్వైపాక్షికతను గౌరవించి పన్ను, ఆర్థిక విధానంపై కలిసి పనిచేయగలమని ఆశిస్తున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ ట్విట్టర్లో రాశారు. చాలా మంది రిపబ్లికన్లు ఆమెతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. జర్మన్ ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్కోల్జ్.. జానెట్ యెల్లెన్ను అభినందించారు. డిజిటల్ పన్నుపై అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవడంలో పురోగతికి యెల్లెన్ నాయకత్వం వహించగలరని భావిస్తున్నట్లు స్కోల్జ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'
మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బీజేపీలో చేరుతానంటున్న టిక్కెట్ దక్కని సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక.. మరోవైపు ఇద్దరు హత్య
- మీరు ఎదిగి పదిమందికి సాయపడాలి : ఎమ్మెల్సీ కవిత
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అదేమిటంటే..
- చచ్చిపోయిన హీరోను మళ్లీ బతికిస్తారా
- సీఎం కేసీఆర్‌ను కలిసి వాణీదేవికి మద్దతు ప్రకటన
- ‘డోర్ టు డోర్ విరాళాలు నిలిపివేశాం.. ఆన్లైన్లో సేకరిస్తాం’
- ఎక్కువ పాన్‌కార్డులుంటే భారీ పెనాల్టీ