బుధవారం 05 ఆగస్టు 2020
Tourism - Jul 12, 2020 , 21:51:55

ఎల్లుండి నుంచి కశ్మీర్లో పర్యాటకులకు అనుమతి

ఎల్లుండి నుంచి కశ్మీర్లో పర్యాటకులకు అనుమతి

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఎల్లుండి నుంచి సందర్శకులను అనుమతించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. జూలై 14 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటక రంగాన్ని దశలవారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా, పర్యాటకులు, ఆతిథ్య రంగంలో నిమగ్నమైన వ్యక్తులు / అధికారులు అనుసరించాల్సిన ప్రోటోకాల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి దశలో వాయు మార్గం ద్వారా వచ్చేవారికి మాత్రమే పరిమితం చేయనున్నారు. అంతేకాకుండా, పర్యాటకులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. 

ఇవీ మార్గదర్శకాలు 

జమ్ముకశ్మీర్ పర్యటనకు వచ్చే వారందరూ బస కోసం హోటల్ బుకింగ్‌లను  ముందే చేసుకోవాలి. పర్యాటకులందరూ తప్పనిసరిగా రిటర్న్ ఎయిర్ టిక్కెట్లను ధృవీకరించాలి. పర్యాటకులు రాగానే తప్పనిసరి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ గా తేలినవారు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. 65 ఏండ్ల వయసు పైబడిన వారు రాకుండా చూసుకోవాలి. పర్యాటకులందరూ తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 

ఇలాఉండగా, కరోనావైరస్ కారణంగా జమ్ముకశ్మీర్‌లో 10,156 కొవిడ్-19 కేసులు నమోదు కాగా, 169 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


logo