ఆదివారం 06 డిసెంబర్ 2020
Tourism - May 31, 2020 , 13:24:51

పునర్వైభవం దిశగా గోవా పర్యటక రంగం

పునర్వైభవం దిశగా గోవా పర్యటక రంగం

పనాజి: కరోనావైరస్‌ మహమ్మారి అన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాలను బాగా దెబ్బతీసింది. ఈ క్రమంలో తిరిగి ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గోవా ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించబడుతుంది. రాష్ట్రం పెద్ద సంఖ్యలో దేశీయ, విదేశీ ప్రయాణికులను ఆకర్షిస్తుంది.

కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘కఠినమైన‘ చర్యలు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే గోవా మళ్ళీ తిరిగి అభిమాన పర్యాటక కేంద్రంగా వెలుగుతుందని రాష్ట్ర మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖను కూడా నిర్వహిస్తున్న గోవా పరిశ్రమల శాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకం, ఇతర ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. 

కరోనా రోగులకు సంబంధించినంతవరకు గోవాలో అద్భుతమైన రికవరీ రేటు ఉందన్నారు. ఇటీవల కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగినప్పటికీ ఇప్పుడు తగ్గిందని ఆయన చెప్పారు. గోవాలో ప్రస్తుతం 28 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 70 మంది రోగులలో 42 మంది కోలుకున్నారు.