మంగళవారం 07 ఏప్రిల్ 2020
Tourism - Mar 26, 2020 , 12:28:26

న‌య‌న మ‌నోహ‌రం.. భూగోళం అందం

న‌య‌న మ‌నోహ‌రం.. భూగోళం అందం

స్పందించే మ‌న‌సుండాలేగానీ భూమి అందాల‌ను ఆస్వాదించేందుకు జీవిత‌కాలం సరిపోదు. ఎంతో మంది ప్ర‌కృతి ప్రేమికులు చెప్పే మాట ఇది. ఈ మాట అక్ష‌రాలా నిజం అని నిరూపించింది నేచ‌ర్ టీటీఎస్ ఫొటోగ్రాఫ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ 2020 కంటెస్ట్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి ఫ్రొఫెష‌నల్ ఫొటోగ్రాఫ‌ర్ క‌ల ఈ కంటెస్ట్‌లో పాల్గొన‌టం. ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా లెక్క‌కు మిక్కిలి ఫొటోలు ఈ కంటెస్ట్‌లో పోటీ ప‌డ్డాయ‌. ఫైన‌ల్‌గా ఫ్రెంచ్ ఫొటోగ్రాఫ‌ర్ ఫ్లోరియ‌న్ లెడాక్స్ విజేత‌గా నిలిచారు.  అంటార్కిటికాలో చుట్టూ మంచు క‌రిగిపోతుండ‌గా ఒక మంచు దిమ్మ‌పై సీల్స్ సేద‌తీరుతున్న దృష్యాన్ని ఆకాశం నుంచి ఎంతో అందంగా ఫొటో తీశారు. 


ఈ కంటెస్ట్‌లో ఇత‌ర క్యాట‌గిరీల్లో అవార్డులు అందుకున్నవాటితోపాటు మ‌రికొన్ని అంద‌మైన ఫొటోల‌ను కూడా నేచ‌ర్ టీటీఎల్ సంస్థ విడుద‌ల చేసింది.  హైలీ క‌మెండెడ్ ల్యాండ్‌స్కేప్‌ విభాగంలో బ్రాండ‌న్ యోషిజ‌వా అవార్డు అందుకున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్క‌న్ 9 రాకెట్ ప్ర‌యోగాన్ని సియెర్రా నెవెడా ప‌ర్వ‌తాల పై నుంచి ఎంతో అందంగా ఆయ‌న ఫొటీ తీశారు. 


హైలీ క‌మెండెడ్ మ్యాక్రో క్యాట‌గిరీలో సైట్లీ హెండ‌ర్‌స‌న్ తీసిన ఫొటో అవార్డు ఎగ‌రేసుకుపోయింది. ఉత్త‌ర ఆస్ర్టేలియాలోని ఓ చెట్టుకు అంటుకొని దాని బెర‌డులో క‌లిసిపోయిన‌ట్లు ఉన్న సాలీడు ఫొటోకు హైండ‌ర్‌స‌న్ అవార్డు అందుకున్నారు.  మ‌రికొన్ని అంద‌మైన ఫొటోలు కూడా చూసేయండి.