శుక్రవారం 07 ఆగస్టు 2020
Tourism - Jan 08, 2020 , 17:40:39

గండిపేటకు కొత్తందాలు..పర్యాటకులకు కనువిందు

గండిపేటకు కొత్తందాలు..పర్యాటకులకు కనువిందు

హైదరాబాద్ : చారిత్రక గండిపేట జలాశయ తీరంలో పర్యాటకులను కనువిందు చేసే కొత్తందాలను హెచ్‌ఎండీఏ పరిచయం చేస్తున్నది. వందేండ్ల వైభవాన్ని సొంతం చేసుకోబోతున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) తీరాన్ని అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని, ఈ మేరకు రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. 1920 సంవత్సరంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్‌ 2020 సంవత్సరం నాటికి వందేండ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ రిజర్వాయర్‌ను టూరిస్ట్‌ హబ్‌గా మార్చేందుకుగానూ హెచ్‌ఎండీఏ రూ. 100కోట్లతో సుందరీకరణ పనులకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తొలి విడతగా జలమండలి ద్వారక పార్క్‌కు ఆనుకుని ఉన్న 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.35.60కోట్లతో ల్యాండ్‌స్కేపింగ్‌ పార్కు పనులకు టెండర్లను ఆహ్వానించి ఈ ప్రకియను ఇటీవల పూర్తి చేసింది.

పార్కును తమ ఆధీనంలోకి తీసుకునే క్రమంలో హెచ్‌ఎండీఏ జలమండలి ఎండీకి లేఖ రాశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాగానే పనులను చేపడుతామని అధికారులు తెలిపారు. త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా గండిపేట సుందరీకరణ పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నామని, ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ల్యాండ్‌స్కేపింగ్‌ పార్కులో కిడ్స్‌ ప్లే ఏరియా, పబ్లిక్‌ ఏరినా విత్‌ వాటర్‌ ఫ్రంట్‌ లైన్‌ డెవలప్‌మెంట్‌, హంపి థియేటర్స్‌, బోర్డు వాక్‌, వివింగ్‌ డక్స్‌ అండ్‌ జెట్టీస్‌, ఫుడ్‌ కోర్టులు, స్కేటింగ్‌ జోన్‌, సైకిల్‌ ట్రాక్స్‌, వాక్‌వే, టెర్రస్‌ గార్డెన్స్‌, పిక్నిక్‌ స్పేస్‌, ఔట్‌ డోర్‌ జిమ్‌, ఆర్ట్‌ పవిలైన్స్‌, ఎంట్రన్స్‌ పవిలైన్‌ విత్‌ వాచ్‌ అండ్‌ వార్డ్‌ రూమ్‌, ఎంట్రన్స్‌ ఫ్లాజాలు ఏర్పాటు చేయనున్నారు.


logo