బుధవారం 08 ఏప్రిల్ 2020
Tourism - Jan 08, 2020 , 17:38:47

ఆక్సిజన్ పార్కులో..అలరిస్తున్న విదేశీ పక్షులు

ఆక్సిజన్ పార్కులో..అలరిస్తున్న విదేశీ పక్షులు

మేడ్చల్: కాంక్రీట్ కట్టడాల మధ్య నిత్యం విసిగి వేసారుతున్న జనజీవనానికి అహ్లాదకర వాతావరణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కులు సత్ఫలితాలను అందిస్తున్నాయి. మేడ్చల్ పట్టణ సమీపంలోని కండ్లకోయ ఔటర్ రింగురోడ్డు జంక్షన్ పక్కన ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు సందర్శకులతో కలకలలాడుతున్నది. ఇందులో ఏర్పాటు చేసిన వాక్ ఇన్ ఐవేరీ కేంద్రం మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సుమారు 70కి పైగా విదేశీ పక్షులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పార్కుకు ప్రతి రోజు సుమారు 400 వరకు, సెలవు దినాల్లో 6 నుంచి 7 వందల మంది సందర్శకులు వస్తున్నారు.

రకరకాల పక్షులు


కేంద్రంలో బ్లూ గోల్డ్ మాకావ్ 4, సిల్వర్ పీసంట్ 4, సన్ కన్యూర్స్ 2, వైట్ కాక్‌టైల్ 50, పర్లీ కన్యూర్ 2, జెండే కన్యూర్ 2, బ్లూ ఫైనాపిల్ 4, బ్లూ గ్రీన్ షీట్ 1, ఎల్లో షేడెడ్ 1, సినామిన్ కన్యూర్స్ 3 తదితర పక్షులు 70కి పైగా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్లూ గోల్డ్ మకావ్ పక్షులు ఆకర్శణగా నిలిస్తున్నాయి

అందరికీ అందుబాటులో..

పక్షులను అందరికీ అందుబాటులో ఉంచాలని ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయకుండా ఎంట్రీ టికెట్ మీదనే వీక్షించే అవకాశం కల్పించాం. చాలా మంది విద్యార్థులు, చిన్నారులు వచ్చి పక్షులను చూసి సంతోషంతో వెళ్తున్నారు. విదేశీ పక్షులకు ఆవాస యోగ్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడంతో అవి గుడ్లు పెట్టి పొదుగు దశకు చేరుకున్నవి.
- శ్రీనివాస్, డీఆర్‌వో. అటవీశాఖ


logo