న్యూల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని హిందీలో ట్వీట్ చేశారు.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి చాలా రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటంపై నిషేధం అమలులో ఉన్నది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 62 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షలకు సమీపంలో ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్