39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనుమలు, మనుమరాళ్లు. ఇక, కోడళ్లను కలుపుకుంటే కుటుంబసభ్యుల సంఖ్య 160 పైచిలుకే. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ కుటుంబ పెద్ద జియోంగాక అకా జియోనా (76) ఆదివారం కన్నుమూశారు. మిజోరం రాష్ర్టానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.