మేషం: కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
వృషభం: ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
మిథునం: స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి.
కర్కాటకం: పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
సింహం: ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్య: తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోమే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
తుల: వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
వృశ్చికం: కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ధనుస్సు: బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసేపనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం: ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
కుంభం: ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
మీనం: రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868