మేషం: కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసేకార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీలమూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగువుతుంది.
వృషభం: ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలమూలకంగా ధనలాభం ఉంటుంది.
మిథునం: అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
కర్కాటకం: మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తవహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
సింహం: కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్నికార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య: నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
తుల: మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
వృశ్చికం: విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
ధనుస్సు: కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
మకరం: విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కుంభం: తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
మీనం: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868