హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అపరిశుభ్రంగా ఉండే క్లాత్ లేదా సర్జికల్ మాస్కులను వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం ఉన్నదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పేర్కొన్నది. శుభ్రం చేసుకోకుండా మాస్కులను తరుచూ వినియోగించడం వల్ల మాస్కుపై ఫంగస్ చేరి, అక్కడి నుంచి ముక్కులోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అధ్యయన ఫలితాలను వెల్లడించింది. కొవిడ్ చికిత్సలో ఇష్టారీతిన స్టెరాయిడ్స్ వినియోగం, డయాబెటిక్ వంటివి కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణంగా నిలుస్తున్నాయని స్పష్టంచేసింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన 352 పేషెంట్లను నాలుగు వర్గాలుగా విభజించి ఎయిమ్స్ వైద్య బృందం అధ్యయనం చేసింది.