హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 403 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించగా, 313 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,742కు చేరింది. ఇందులో 3,00,469 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1690 మంది మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4583 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 1815 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 146 ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.98 శాతం, మరణాల రేటు 0.55 శాతం ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 33,930 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,00,53,026కు చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్