e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home Top Slides వంటింట్లో మోదీ మంట

వంటింట్లో మోదీ మంట

  • టీఆర్‌ఎస్‌ నమ్మకం.. బీజేపీ అమ్మకం
  • హుజూరాబాద్‌లో గులాబీదే విజయం
  • ఇక ప్రతిపక్షాలకు నిమజ్జనం తప్పదు
  • ప్రజాభిమానమే సీఎం కేసీఆర్‌ ఆస్తి
  • ప్రగతి భవన్‌.. భవితకు స్ఫూర్తి భవన్‌
  • మీడియాతో ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని.. ఇప్పటికే 100కుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని బేరానికి పెట్టిన బీజేపీ అమ్మకం పార్టీగా మిగిలిపోయిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. వంటగ్యాస్‌, వం ట నూనె, నిత్యావసర సరుకుల ధరలను ఆకాశానికి తీసుకెళ్లిన బీజేపీ ప్రభుత్వం.. వంటింటిని మంటిల్లుగా మార్చిందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో గెలిచేది ముమ్మాటికీ టీఆర్‌ఎస్సేనని.. ప్రతిపక్షాలకు నిమజ్జనం తప్పదని చెప్పారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.

తెలంగాణ భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రగతి భవన్‌ను కించపరిచేలా బండి సంజయ్‌ లేఖ విడుదల చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రగతిభవన్‌ వేదికగా రూపొందించిన అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిన విషయాన్ని బండి మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర ప్రజలను అవమాన పరిచేలా వ్యవహరించిన ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు దైవంగా కొలిచే సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ను ఒక్క మాటంటే తాము వెయ్యి అంటామని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను కొనుగోలు చేయటంలో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని విమర్శించారు.

- Advertisement -

బండి.. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్‌ పోటీ పడుతుంటే.. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో ప్రధాని మోదీ పోటీ పడుతున్నారని బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు. వంటగ్యాస్‌, వంట నూనె, నిత్యావసర సరుకుల ధరలను ఆకాశానికి తీసుకెళ్లిన బీజేపీ ప్రభుత్వం.. వంటింటిని మంటిల్లుగా మార్చిందని మండిపడ్డారు. బీరాలు పలుకుతున్న ఆ పార్టీ ఎంపీలు రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అడగడుగునా అబద్ధాలు ప్రచారం చేస్తూ బండి పాదయాత్రతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. రాత్రంతా వందల పురుగులను తిన్న బల్లి పొద్దున్నే దేవుని ఫొటో వెనుక నిలుచున్న చందంగా బండి వ్యవహారం ఉన్నదని ఎద్దేవా చేశారు. దేశంలో మోదీ గ్రాఫ్‌ 42 శాతానికి పడిపోయిందని చెప్పారు.

కేసీఆర్‌పై లేఖరాసే అర్హత బండికిలేదు
పాదయాత్రకు గిరాకీ లేక బండి సంజయ్‌ కిరాక్‌తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై లేఖ రాసే అర్హత ఆయనకు లేదని చెప్పారు. జు ట్టు తీసేసిన కొబ్బరికాయ లెక్కుండే బండి నో రు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కెంత? సీఎం కేసీఆర్‌ ఆస్తులెన్ని? అని మాటిమాటికి అడిగేందుకు ఆ యన ఏమైనా టీఆర్‌ఎస్‌ పార్టీ గుమస్తానా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్టే ప్రతిపైసా ఖర్చు ను కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్‌ తన నివేదికలో చూసుకుంటుందనే విషయం తెలియని అజ్ఞాని అని ఎద్దేశా చేశారు. బండి సం జయ్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాదు.. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలువలేడని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. సీఎం కేసీఆర్‌ను తిడితే హీరోలు అవుతామనుకున్న ఎంతోమంది జీరోలు అయ్యార న్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని అసెం బ్లీ సాక్షిగా చెప్తుంటే.. బండి మాత్రం తొండి మా టలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement