e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home Top Slides రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు

రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు

 • రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం
 • లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు
 • పార్లమెంట్‌ ‘ప్రైడ్‌’ కార్యక్రమంలో ప్రదర్శన
 • సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరుకు అద్దం
 • ఎస్తోనియా దారిలో తెలంగాణ టెక్‌ పరుగులు
 • ఆన్‌లైన్‌ సేవలందించటంలో దేశంలోనే మేటి

రవాణా శాఖలో నాణ్యమైన సేవలు అందించేందుకు ఆర్టీడీఏఐ ఆధారంగా తెలంగాణ ఐటీశాఖ ‘ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఫెస్ట్‌) డిజిటల్‌ వేదికను అభివృద్ధి చేశారు. దీంతో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలకు వెళ్లకుండానే, టీ-యాప్‌ ఫోలియో ద్వారా పౌరులు ఫెస్ట్‌ సేవలు పొందుతున్నారు. డ్రైవింగ్‌ టెస్ట్‌, వెహికిల్‌ ఇన్‌స్పెక్షన్‌ మినహా మరే ఇతర సేవలకు భౌతికంగా హాజరయ్యే అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే పొందుతున్నారు.

రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు

హైదరాబాద్‌, జూలై 11 (నమస్తే తెలంగాణ): ప్రజలకు అత్యంత నాణ్యమైన సేవలు అందించాలి. అవి అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా ప్రజలకు చేరాలి. అందుకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకోవాలి.. ఇది తెలంగాణ ప్రభుత్వ విజన్‌.. ఆ దారిలో దేశంలోని అన్ని రాష్ర్టాలను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నది. టెక్‌ తెలంగాణగా, డిజిటల్‌ తెలంగాణగా విశ్వవ్యాప్త గుర్తింపు సాధిస్తున్నది. తెలంగాణ టెక్‌ ప్రగతిపై తాజాగా పార్లమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ (ప్రైడ్‌) ప్రశంసలు కురిపించింది. ‘ఎమర్జింగ్‌ టెక్నాలజీల వినియోగం’ అనే అంశంపై ఈ నెల 9న పార్లమెంట్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌లో తెలంగాణలో పాలనా విషయాల్లో వినియోగిస్తున్న టెక్నాలజీ ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డాటా అండ్‌ డీప్‌ లెర్నింగ్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల వినియోగంపై తెలంగాణ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం ప్రైడ్‌ వర్క్‌షాప్‌లో వివరించింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల సభ్యులు, భారత రాయబార కార్యాలయాల అధికారులు, పార్లమెంట్‌ ఉద్యోగులు, మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొని డిజిటల్‌ తెలంగాణ ఘనతపై ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

ఎస్తోనియా బాటలో తెలంగాణ
యూరప్‌ ఖండంలోని ఒక చిన్న దేశం ఎస్తోనియా. డిజిటల్‌ సేవలు అందించడంలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నది. పెండ్లిళ్లు, స్థిరాస్తుల అమ్మకాల సమయంలో మాత్రమే అక్కడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారు. మిగతా అన్ని సేవలు మొబైల్‌, కంప్యూటర్‌ ద్వారా నిర్వహిస్తారు. అలాంటి సేవలే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ఎమర్జింగ్‌ .టెక్నాలజీలను ముందుగానే అందిపుచ్చుకొని కాంటాక్ట్‌ లెస్‌, ప్రజెన్స్‌ లెస్‌ సేవలను వేగంగా అమలుచేస్తున్నది. ఈ చర్యలు తెలంగాణను లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా ఎదిగేందుకు దోహదం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వ పర్యవేక్షణలో డిజిటల్‌ తెలంగాణ కల సాకారమవుతున్నది. పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, బిగ్‌ డాటా, బ్లాక్‌ చెయిన్‌, డ్రోన్స్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలను పరిపాలనలో వినియోగిస్తున్నది. పౌరుల ఐడెంటిటీని సులువుగా గుర్తించేలా హౌసింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌, మెడికల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ తదితర విభాగాలతో లింక్‌ చేసింది.

రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు

తప్పిన కష్టాలు
ఎయిర్‌పోర్టులు, పరీక్ష కేంద్రాలు, ట్రాన్స్‌పోర్ట్‌, పాస్‌పోర్ట్‌ సేవా కార్యాలయాల్లో పౌరులు భౌతికంగా హాజరై ఐడీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పింఛన్లు పొందేవారు సైతం బ్యాంకులు లేదా మీసేవా కేంద్రాలకు వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం, బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. భౌతికంగా హాజరై ఆయా సేవలు పొందాల్సి ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ కృషి చేసింది. పేర్లు, ఫొటో, ఫిజికల్‌ వెరిఫికేషన్‌ వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి కేవలం మొబైల్‌ ద్వారా పౌరులు పూర్తి చేసేలా అభివృద్ధి చేసింది. ‘రియల్‌ టైం డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ (ఆర్టీడీఏఐ) ని ఆవిష్కరించింది. సులభమైన, సౌకర్యవంతమైన, సరైన పౌర సేవలను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా అందించేందుకు ఇది ఉపయోగపడుతున్నది.

‘ఫెస్ట్‌’ ద్వారా విలువైన సేవలు
రవాణా శాఖలో నాణ్యమైన సేవలు అందించేందుకు ఆర్టీడీఏఐ ఆధారంగా ‘తెలంగాణ ఐటీశాఖ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఫెస్ట్‌) డిజిటల్‌ వేదికను అభివృద్ధి చేశారు. దీంతో ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలకు వెళ్లకుండానే నాణ్యమైన సేవలు పొందడం సాధ్యమవుతున్నది. ఎం-గవర్నెన్స్‌లో భాగంగా ఆవిష్కరించిన టీ-యాప్‌ ఫోలియో ద్వారా ఫెస్ట్‌ సేవలు పౌరులు పొందుతున్నారు. డ్రైవింగ్‌ టెస్ట్‌, వెహికిల్‌ ఇన్స్‌పెక్షన్‌ మినహా మరే ఇతర సేవలకు భౌతికంగా హాజరయ్యే అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే పొందుతున్నారు. ఫెస్ట్‌ ద్వారా 4 క్యాటగిరీల్లో 17 సేవలు లభిస్తున్నాయి. మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఫెస్ట్‌ ద్వారా రోజుకు 400 లావాదేవీలు జరుగుతుండగా, ఆదివారాల్లోనూ 300 దాకా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్స్‌ జరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ సేవలు పొందడం ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగం వల్ల సాధ్యమైంది. ఈ తరహా సేవలందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ఎస్తోనియా బాటలో..
యూరప్‌ ఖండంలోని ఒక చిన్న దేశం ఎస్తోనియా. డిజిటల్‌ సేవలు అందించటంలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నది. పెండ్లిళ్లు, స్థిరాస్తుల అమ్మకాల సమయంలో మాత్రమే అక్కడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారు. మిగతా అన్ని సేవలు మొబైల్‌, కంప్యూటర్‌ ద్వారానే నిర్వహిస్తారు. అలాంటి సేవలే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలను ముందుగానే అందిపుచ్చుకొని కాంటాక్ట్‌ లెస్‌, ప్రజెన్స్‌ లెస్‌ సేవలను వేగంగా అమలుచేస్తున్నది.
ఈ చర్యలు తెలంగాణను లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా ఎదిగేందుకు దోహదం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వ పర్యవేక్షణలో డిజిటల్‌ తెలంగాణ కల సాకారమవుతున్నది.

రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు

పౌరులకు అందుతున్న సర్వీసుల్లో కొన్ని..

 • సులభంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, లెర్నర్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, పర్మిట్‌.
 • పెన్షన్‌ దారులు సెల్ఫీ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించడం. విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ సేవలు పొందుతున్నారు.
 • డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా విద్యార్థుల ప్రవేశాలు.
 • గత మున్సిపల్‌ ఎన్నికల్లో 10 పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లను గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ వినియోగం.
 • ఐఐటీ మద్రాస్‌ సహకారంతో మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఓటు వేసే పైలట్‌ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి.
 • టెలి మెడిసిన్‌, వ్యవసాయం, పోలీసు, ట్రాఫిక్‌ వంటి విభాగాల్లో టెక్నాలజీ వినియోగం.
 • దేశంలోనే తొలిసారి 2020 ఏడాదిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంవత్సరంగా ప్రకటన.
రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు
రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు
రాష్ట్ర డిజిటల్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. లీడింగ్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌గా గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement