e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home Top Slides తనకుతానే రాజకీయ సమాధి కట్టుకున్నారు

తనకుతానే రాజకీయ సమాధి కట్టుకున్నారు

  • ఢిల్లీలో బీజేపీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు
  • మంత్రిగా ఉన్నప్పుడు బలహీనవర్గాలకు అన్యాయం
  • నీళ్లులేనిది కోటిన్నర ఎకరాలు ఎలా సాగవుతున్నయ్‌?
  • అవగాహనారాహిత్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు
  • రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా ధ్వజం
తనకుతానే రాజకీయ సమాధి కట్టుకున్నారు

హైదరాబాద్‌, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): వామపక్ష పక్షపాతి.. కమ్యూనిస్టు పక్షపాతి.. బడుగు, బలహీనవర్గాల పక్షపాతిగా చెప్పుకొనే ఈటల రాజేందర్‌ ఇప్పుడు ఆ ఇజాలన్నింటినీ ఏంచేశారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటూ తిరిగే ఆయనకు ఆత్మ ఎక్కడున్నది.. గౌరవం ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఈటల తన రాజకీయ సమాధిని తానే కట్టుకుంటున్నారని మిగతా 2వ పేజీలోయమించామని తెలిపారు. బీజేపీ అధికారం లో ఉన్న కర్ణాటకలో టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని ఆందోళన చేసిన వారిని జైళ్లల్లో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

దేశ ప్రతిష్ఠను దిగజార్చిన బీజేపీ: బోడకుంటి
కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ఠను దిగజార్చిందని మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ర్టాన్ని దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బీజేపీ నేతలకు బుద్ధిరావడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈటల రాజేందర్‌ ఢిల్లీలో బీజేపీ నేతల వద్ద తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవడాన్ని తెలంగాణ సమాజం ఈసడించుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యనాయకుడిగా, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ అనేకమంది నాయకులను తయారు చేశారని పల్లా తెలిపారు. కరీంనగర్‌ పార్టీ అధ్యక్షుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధానపార్టీగా ఈటలకు సీఎం కేసీఆర్‌ అనేక అవకాశాలు ఇచ్చారని చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేను చేయడంతోపాటు, మూడుసార్లు మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. బీజేపీ నేతలను కలిసిన ఈటల రాజేందర్‌.. తన ఇజాలన్నింటినీ ఎక్కడ తాకట్టుపెట్టారని నిలదీశారు. బాధ్యతాయుతమైన మంత్రిహోదాలో ఉండి బడుగు, బలహీనవర్గాలకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గర దేవరయాంజాల్‌ భూముల క్రమబద్ధీకరణ కోసం పాకులాడిన వ్యక్తి అని విమర్శించారు. పార్టీలో, ప్రభుత్వంలో ఉంటూనే ప్రపంచంలోనే ఉత్తమంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలను విమర్శించడంతోపాటు, పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఏం చేయాలో అధినేత కేసీఆర్‌కు తెలుసని.. ఈటల విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు.

కాషాయనేతలు కండ్లున్న కబోదులు
ఏడేండ్ల స్వరాష్ట్ర పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూడలేని కండ్లున్న కబోదులు బీజేపీ నేతలు అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ నీళ్లు.. నిధులు.. నియామకాలను నెరవేర్చుకుంటూ సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శపాలన అందిస్తున్నారని చెప్పా రు. బీజేపీ నాయకులకు నీళ్లెక్కడున్నాయో తెలియాలంటే చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల వద్దకెళ్లి చూడాలని.. నీళ్లు లేనిది వానకాలంలో కోటిన్నర ఎకరాలు ఎలా సాగువుతున్నదనే కనీస అవగాహన కూడా వారికి లేదని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పల్లా తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల నుంచి కనీసం కిలో వడ్లనైనా కొంటున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 19,212 (పాఠశాలలు 8,443, రెసిడెన్షియల్‌లో 10,510, యూనివర్సిటీల్లో 259 మందిని) మంది టీచర్లను నియమించామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని ఆందోళన చేసిన వారిని జైళ్లల్లో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

దేశ ప్రతిష్ఠను దిగజార్చిన బీజేపీ: బోడకుంటి
కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ఠను దిగజార్చిందని మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ర్టాన్ని దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బీజేపీ నేతలకు బుద్ధిరావడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తనకుతానే రాజకీయ సమాధి కట్టుకున్నారు

ట్రెండింగ్‌

Advertisement