e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home Top Slides పెట్టుబడుల గమ్యం హైదరాబాద్‌

పెట్టుబడుల గమ్యం హైదరాబాద్‌

  • బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌,బీమారంగాల్లో లక్షా 80 వేల మందికి ఉపాధి అవకాశం
  • ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు
  • హైదరాబాద్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ కార్యాలయం ప్రారంభం
పెట్టుబడుల గమ్యం హైదరాబాద్‌

హైదరాబాద్‌, జూలై 19 (నమస్తే తెలంగాణ): బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాల్లో హైదరాబాద్‌ వేగంగా వృద్ధి చెందుతున్నదని, ఈ రంగాల్లో ప్రతిష్ఠాత్మక కంపెనీలు పెద్ద మొ త్తంలో పెట్టుబడులు పెట్టాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ మూడు రంగాల్లోనే లక్షా 80 వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రఖ్యాతిగాంచిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ కంపెనీల్లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఒకటని కొనియాడారు. హైదరాబాద్‌కు ఉన్న భిన్న అనుకూలతలు ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలకు తోడు డైనమిక్‌ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని స్థిరమైన ప్రభుత్వం, వృద్ధి లో పోటీతత్వం వంటి లక్షణాలు గత ఏడేండ్లలో రాష్ట్రానికి పెద్ద పెట్టుబడులు వచ్చేలా చేశాయని చెప్పారు. ఈ క్రమంలో ఫార్చూన్‌ 500 జాబితాలోని అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. మూడేండ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని గోల్డ్‌మన్‌ శాక్స్‌ కంపెనీ ప్రతినిధులు చెప్పడం హర్షణీయమన్నారు. ఐఎస్‌బీ, ఐఐఎం బెంగళూరు సహకారంతో దేశవ్యాప్తంగా పదివేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలన్న గోల్డ్‌మన్‌ శాక్స్‌ లక్ష్యాన్ని కేటీఆర్‌ అభినందించారు.

- Advertisement -

ఇందుకోసం హైదరాబాద్‌లోని వీ-హబ్‌తో కలిసి పనిచేయాలని, కోహర్ట్‌ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, రోబోటిక్స్‌, బ్లాక్‌చైన్‌ సాంకేతికల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతున్నదని తెలిపారు. ఆర్థికరంగంలో మరి న్ని ఆవిష్కరణల రూపకల్పన దోహదపడుతున్న టీ-హబ్‌ కలిసి పనిచేయాలని కేటీఆర్‌ కోరారు. ఆర్థికరంగ సేవల్లో స్టార్టప్స్‌, ఆవిష్కరణలు మంచి పరిష్కారాలు కనుగొంటున్నాయ ని, ఈ రంగం లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణలో నైపుణ్యం కలిగిన యు వతకు కొదువ లేదని, ఉద్యోగాల భర్తీలో టా స్క్‌తో కలిసి పనిచేయాలని, స్థానిక యువతకు అవకాశాలు వచ్చేలా చూడాలని కోరారు.

2023 నాటికి 2,500 మంది ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పరిశోధన, అభివృద్ధిలో అందిస్తున్న ప్రోత్సాహాలు, అం కుర సంస్థలకు అనువు వాతావరణం వంటి అ నేక అంశాలు హైదరాబాద్‌వైపు వచ్చేలా చేశాయని భారత్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ సేవల విభాగాధిపతి గుంజన్‌ సంతాని తెలిపారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగంతో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదన్నారు. ఐఐటీ హైదరాబా ద్‌, ఐఎస్‌బీ వంటి ప్రపంచస్థాయి సంస్థలు నైపు ణ్యం గల యువతను అందిస్తున్నాయని కొనియాడారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టడం సం తోషంగా ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ 250 మంది ఉద్యోగులున్నారని, 2021 చివరి నాటికి 800 మంది, 2023 నాటికి 2,500 మంది ఉంటారని చెప్పారు.

హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించడం అంతర్జాతీయసంస్థగా తమ సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని తెలిపారు. రోటరీ సంస్థతో కలిసి తెలంగాణలో డిజిటల్‌ లిట్రసీని పెంపొందించేందుకు రూ.2 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. బెంగళూ రు, హైదరాబాద్‌ కార్యాలయాలు కేంద్రంగా భా రత్‌లో మరింత వృద్ధిని సాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, రెడ్డీస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, టీహబ్‌ సీఈవో రవినారాయణ్‌, వీహబ్‌ సీఈవో దీప్తి రావుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెట్టుబడుల గమ్యం హైదరాబాద్‌
పెట్టుబడుల గమ్యం హైదరాబాద్‌
పెట్టుబడుల గమ్యం హైదరాబాద్‌

ట్రెండింగ్‌

Advertisement