e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home Top Slides గౌరవ వేతనాలు పెరిగినయ్‌

గౌరవ వేతనాలు పెరిగినయ్‌

  • స్థానిక ప్రజాప్రతినిధులకు 30% పెంపు
  • ఉత్వర్వులు జారీచేసిన ప్రభుత్వం
  • ఈ ఏడాది జూన్‌ నెల నుంచే వర్తింపు
  • 18 వేల మందికిపైగా ప్రయోజనం
  • హర్షం ప్రకటించిన ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (నమస్తే తెలంగాణ): గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్‌ల వేతనాన్ని 30 శాతం పెంచుతూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణ యం తీసుకొన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా విడుదలచేశారు. పెరిగిన గౌరవ వేతనాలు ఈ ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 18 వేలమంది సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కే చంద్రశేఖర్‌రావు 2015 జూన్‌ 24న తొలిసారి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను గణనీయంగా పెంచారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను 30% పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా వేతనాలు పెంచలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు. సీఎం నిర్ణయంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.

- Advertisement -

పల్లెలపై కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం
స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడమే కాకుండా, ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు కూడా పెంచడం సీఎం కేసీఆర్‌కు స్థానిక సంస్థలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపు రేఖలు మారాయి. సీఎం ఆశయాలకు అనుగుణంగా పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కరోనా సమయంలో కొరత ఉన్నా ఎలాంటి కోతలు పెట్టకుండా నిధులను విడుదల చేస్తున్నారు.

  • ఏనుగు భరత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, రంగారెడ్డి జిల్లా

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
ఉద్యోగుల వేతనాలతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం గౌరవ వేతనం పెంచడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రీయాశీలకం చేస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీని ఆచరణలో చూపించాం.

  • హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
గౌవర వేతనాలు పెంచినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా సమయంలోనూ స్థానిక సంస్థలకు ఎలాంటి కోతలు విధించకుండా నిధులు విడుదల చేస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా పెద్ద ఎత్తున నిధులు విడుదలచేశారు. పల్లె ప్రగతి అమలులో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలి.

  • ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి

స్థానిక సంస్థల బలోపేతానికి కృషి
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు 30 శాతం పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారు.

  • కల్వకుంట్ల కవిత, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement