e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home Top Slides బీజేపీకి ఓటెందుకెయ్యాలి?

బీజేపీకి ఓటెందుకెయ్యాలి?

  • రాష్ర్టానికి ఏం చేసిందని?
  • సిలిండర్‌కు దండం పెట్టండి..కారు గుర్తుకు ఓటేయండి
  • ప్రజలకు మంత్రి హరీశ్‌ పిలుపు
  • విశ్వబ్రాహ్మణ సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ

హుజూరాబాద్‌, సెప్టెంబర్‌ 16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏమిచేసిందని, హు జూరాబాద్‌ ఉపఎన్నికలో ఆ పార్టీకి ఓటేయా లని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్‌ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే కేం ద్రం దాని గురించి మాట్లాడకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జనాభా లెకలు తీసి దానికనుగుణంగా బీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడమే కాకుండా బీసీలకు బడ్జెట్‌ లో నిధులు కేటాయించాలని కోరితే ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందన్నారు. గ్యాస్‌ ధర ను పెంచుతూ సబ్సిడీని తగ్గించి పేదలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. అయినా బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్‌ ధర రూ.1,500, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా పెంచుకుంటూ పోతుందన్నారు. అందుకే మహిళలంతా ఓటు వేసేందుకు బయల్దేరే ముందు సిలిండర్‌కు దం డం పెట్టి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

ఇదే విషయాన్ని ఏడేండ్ల క్రితం మోదీ కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా చెప్పారని మంత్రి గుర్తుచేశారు. గురువారం జమ్మికుంటలోని ధర్మారంలో రూ. 20లక్షలతో, హుజూరాబాద్‌లోని కాకతీయ కాలు వ వద్ద రూ.కోటితో విశ్వబ్రాహ్మణ సంఘ భవనాలకు భూమి పూజచేశారు. ఈ సందర్భం గా హరీశ్‌రావుకు విశ్వబ్రాహ్మణులు, మహిళలు మంగళహారతులు పట్టి, బొట్టుపెట్టి ఘన స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మా ట్లాడుతూ.. పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటు వేద్దామా?.. లేదంటే ఆ పథకాలను పరిగేరుకున్నట్టు అన్నోళ్ల వైపుఉందామా?.. మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

- Advertisement -

ప్రభుత్వసంస్థలను అమ్మేస్తున్న కేంద్రం
బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల తో ఉద్యోగులు సైతం ఆందోళనకు గురవుతున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్ర ప్రభుత్వం ధ్యే యంగా పెట్టుకుంటుందని, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలు, విమానయాన తదితర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను విక్రయించి రూ.6 లక్షల కోట్లు దోచుకునేందుకు సిద్ధమైందన్నారు. కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌లో 50వేల ఉద్యోగాలు పోయాయని, ఏండ్ల చరిత్ర కలిగిన రైల్వే, విమానయాన తదితర సంస్థలకు ఇదే గతి పట్టనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను గెలిస్తే ఒరిగేదేమీ లేదని, వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా?.. వ్యవస్థ ప్రయోజనం ముఖ్యమో ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ చేసిన అభివృద్ధి శూన్యమని, ఈటల గెలిచినా ఇదే పరిస్థితి ఉం టుందన్నారు. విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణులకు ఉద్యోగ అవకాశాలు
విశ్వబ్రాహ్మణులు అంటే ట్రెడిషనల్‌ ఇంజినీర్‌ ఆఫ్‌ సొసైటీ అని, ప్రపంచంలోనే గొప్ప ఇంజినీర్లు అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. 300 ఎకరాల్లో శామీర్‌పేటలో పెద్ద పరిశ్రమ నెలకొల్పుతున్నామని, దానిలో విశ్వబ్రాహ్మణులు పని చేయగలిగే టాలెంట్‌ ఉంటే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement