e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides బీజేపీని ఓటుతోనే పోటు పొడవాలి

బీజేపీని ఓటుతోనే పోటు పొడవాలి

  • పన్నులు వేయడం తప్ప.. పనులు చేయడం చేతకాని కేంద్రం
  • మేం ఏం చేస్తామో చెప్తున్నాం.. మీరేం చేస్తారో చెప్పే దమ్ముందా?
  • బీజేపీ నేతలకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్‌
  • హుజూరాబాద్‌లో రజకులు, వీఆర్‌ఏలు, జమ్మికుంటలో కుమ్మరుల సమ్మేళనాలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 26 (నమస్తే తెలంగాణ): ‘బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. బీసీలను మోసం చేస్తున్న ఆ పార్టీకి ఓటెందుకు వేయాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో భాగంగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎకరంలో రూ.కోటితో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌ కు శంకుస్థాపన చేశారు. జమ్మికుంటలో జరి గిన కుమ్మరులు, సాయంత్రం హుజూరాబా ద్‌లో నియోజకవర్గస్థాయి వీఆర్‌ఏల ఆత్మీ య సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పన్నులు వేయడం తప్ప పనులు చేయడం చేతకాదన్నారు. హుజూరాబాద్‌లో ధర్మానికి, అధర్మానికి మధ్య ఉప ఎన్నిక జరుగుతున్నదని, ఈ ఎన్నికలో ప్రజల కోసం టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం ఏమి చేస్తున్నదో చెబుతున్నదని, అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల కోసం ఏమి చేస్తున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తనకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నాడని, ఓట్లు వేస్తే ప్రజలకు ఏమి చేస్తడో ముందు చెప్పాలన్నారు. ఇన్నాళ్లు వివిధ పదవుల్లో ఉన్న ఈటల రాజేందర్‌ ఒక్క చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రజకులు గుంటెడు జాగ అడిగినా ఇవ్వలేదని గుర్తుచేశారు. నాలుగైదేండ్ల కింద సీఎం కేసీఆర్‌ నాలుగు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తే రాజేందర్‌ ఒక్కటి కూడా కట్టించి ఇవ్వలేక పోయారని, పదవుల్లో ఉండగా చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏమి చేస్తారని నిలదీశారు.

- Advertisement -

బీజేపీకి పన్నులు వేయడమే తెలుసు..
బీజేపీ ప్రభుత్వానికి ధరలు పెంచడం, పన్నులు వేయడం మాత్రం తెలుసని, ఇలాంటి పార్టీకి హుజూరాబాద్‌ ప్రజలు ఓటుతోనే పోటు పొడవాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో తనకు పలుకుబడి ఉన్నదని చెప్పుకుంటున్న ఈటల.. దమ్ముంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, గిరిజన యూనివర్సిటీని, హుజూరాబాద్‌ ప్రజలకు రూ.2 వేల కోట్ల ప్యాకేజీని తేవాలని డిమాండ్‌ చేశారు. తనను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా ఎంత సేపు మొసలి కన్నీళ్లు కారుస్తూ.. సెంటిమెంట్‌ డైలాగులు చెప్తున్నారని మండిపడ్డా రు. ఈటలను పెంచి పోషించి ఇంత వాడిని చేసిన సీఎం కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలను ఇక్కడి ప్రజలు సహించబోరని మంత్రి హెచ్చరించారు. తన స్వార్థం కోసం బీజేపీలో చేరిన ఈటల, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగినా పర్వాలేదని, తనకు మాత్రం న్యాయం జరిగితే సరిపోతుందనే ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హుజూరాబాద్‌ లో ఇప్పుడు జరగాల్సింది అభివృద్ధి, సంక్షేమమని, ఇంకా రెండున్నరేండ్లు అధికారం లో ఉండే టీఆర్‌ఎస్‌తోనే అది సాధ్యమన్నా రు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నారని, దళితులకు ఎకడైనా ఒక లక్షన్నా ఇచ్చారా..? ఇస్తే ముక్కు నేలకు రాస్తా? అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఏ ఒకటి జరగా లన్నా వీఆర్‌ఏ లతోనేనని, మంచి చెడులు విశ్లేషించి వాస్తవాలను ప్రజలు చెప్పాలని, చర్చ పెట్టి న్యాయాన్ని గెలిపించాలని సూచించారు. ఆయా సభల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌ యాదవ్‌, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మిమ్మల్ని జూసినంక ఈటల గుండె జారిపోతున్నది..
‘మనిషి జీవితం కుమ్మరులతో ముడిపడి ఉంది. కుమ్మరులు సమాజానికి నాగరికత నేర్పిన్రు. మనిషి పుట్టుక నుంచి చనిపోయేదాకా కుమ్మరులు తయారు చేసే కుండలపైనే ఆధారపడి జీవనం కొనసాగుతున్నది. అలాంటి కుమ్మరుల జీవితం లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నరు. పనిచేస్తున్న ప్రభుత్వం కనుకనే ఇంతమంది ఇక్కడికి వచ్చిన్రు. ఇగ మిమ్మ ల్ని జూత్తే ఈటల ఆగమైతండు. వేరే ప్రాంతం నుంచి వచ్చిండ్రని అంటున్నడు. మేరెక్కడి నుంచి వచ్చిన్రు చెప్పాలె.. మీరంతా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలే కదా?.. ఆయన గుండె జారిపోతున్నది.. మిమ్మల్ని జూసినంక దిగజారి మాట్లాడుతున్నడు’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement