e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home Top Slides దళితవాడ.. ప్రగతిజాడ

దళితవాడ.. ప్రగతిజాడ

 • వారి ఉపాధి కోసం వినూత్న పథకాలు..
 • సత్వరమే ఆర్థిక స్వావలంబన కలగాలి
 • అధికారులు ముందుగా సెన్సిటైజ్‌ కావాలి
 • తర్వాత లబ్ధిదారుల్లో ఉద్దీపన కల్గించాలి
 • వారి అభివృద్ధిని వారే నిర్వచించుకోవాలి
 • చైతన్యంతో ఉత్పత్తిలో భాగస్వాములవ్వాలి
 • అప్పుడే దళిత సాధికారతకు నిజమైన అర్థం
 • అధికారులు దళితవాడలకు వెళ్లి మాట్లాడాలి
 • ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి
 • దళితబంధు విధివిధానాలపై సీఎం కేసీఆర్‌
 • ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం
దళితవాడ.. ప్రగతిజాడ

హైదరాబాద్‌, జూలై 19 (నమస్తే తెలంగాణ): తమ అభివృద్ధిని తామే నిర్వచించుకొనే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైననాడే దళితుల సాధికారతకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అనతికాలంలో ఆర్థిక స్వావలంబన చేకూరేలా వినూత్న ఉపాధి సీంలకు రూపకల్పన చేసి దళితబంధు పథకం లబ్ధిదారుల ముందుంచాలని అధికారులను ఆదేశించారు. ముందుగా అధికారులు సెన్సిటైజ్‌ అయి.. తర్వాత పథకాన్ని ఉపయోగించుకోవడంలో లబ్ధిదారుల్లో ఉద్దీపన (సెన్సిటైజ్‌) కలిగించాలని సూచించారు. దళితుల అభివృద్ధికోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న ‘తెలంగాణ దళితబంధు’ పథకం అమలు విధివిధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై సోమవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘అధికారులు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసిన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి, దళిత కుటుంబాల స్థితిగతులను పరిశీలించాలి. వారి అభిప్రాయాలను సేకరించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో, త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని అందించే పనులను గుర్తించి, వాటిని పథకాలుగా మలచాలి. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ముందుగా ఆ దిశగా సెన్సిటైజ్‌ కావాలి’ అని వివరించారు.

దళిత ప్రముఖుల సలహాలు తీసుకోవాలి
ఉన్నతాధికారులు పైలెట్‌ ప్రాజెక్టు కేంద్రంగా ముందుగా అవగాహన పెంచుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూపకల్పన కోసం క్షేత్రస్థాయి పర్యటనలను ఎలా చేపట్టాలి? ఆ సందర్భంగా ఎవరెవరిని కలవాలి? వారినుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి? దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్జుల సలహాలు, సూచనలను తీసుకుని పథకంలో భాగంగా ఎట్లా అమలుపరచాలి? అనే అంశాలపై అధికారులు ముందుగా సెన్సిటైజ్‌ కావాలని సీఎం సూచించారు. ఇందులోభాగంగా దళిత ప్రముఖులు, సంఘాల నేతలు, యాక్టివిస్టులతో త్వరలో వర్‌షాపు నిర్వహించనున్నట్టు తెలిపారు.

- Advertisement -

వర్‌షాప్‌ నిర్ణయాలను అనుసరించి పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న నియోజకవర్గంలోని దళితవాడలకు వెళ్లాలని, అకడ కుటుంబాలతో మాట్లాడాలని, వారి సమస్యలపై అవగాహన ఉన్న ప్రముఖులను కలవాలని, వారి సలహాలు, సూచనలతో సీంలను రూపొందించాలని సీఎం చెప్పారు. దళితుల అవసరాలు ఎట్లున్నయి? అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఎకువకాలం గ్యాప్‌ లేకుండా ఆదాయం సృష్టించుకునే విధంగా ఉందా లేదా గుర్తించి పథకం రూపకల్పన చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితాసబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఎస్సీ డెవలప్‌ కార్పొరేషన్‌ ఎండీ పీ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

దళితవాడ.. ప్రగతిజాడ

నేడు హుజూరాబాద్‌కు ఉన్నతాధికారుల బృందం
‘తెలంగాణ దళితబంధు’ పథకంపై అధ్యయనానికి ఉన్నతాధికారుల బృందం మంగళవారం హుజూరాబాద్‌ వెళ్లనున్నది. మూడ్రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల మనోగతాన్ని తెలుసుకోనున్నది. దళిత సాధికారత ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,200 కోట్లతో పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆ పథకానికి ‘తెలంగాణ దళితబంధు’గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 118 నియోజకవర్గాల్లో దీనిని అమలుచేయాలని నిర్ణయించగా.. హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించి దళితుల స్థితిగతులపై గ్రామస్థాయిలో అధ్యయనం చేయనున్నారు.

పరిపూర్ణ అనుభవంతో నిర్ణయం
సీఎం కేసీఆర్‌ పరిపూర్ణ అనుభవంతో అన్ని కోణాలను లోతుగా విశ్లేషించి దళిత బంధు అమలుకు నిర్ణయించారు. దళిత సాధికారతే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, దళితుల అభ్యున్నతికి పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలతో సుదీర్ఘంగా చర్చించి ఈ పథకాన్ని తెచ్చారు. మిగతా సంక్షేమ పథకాలకు, దళిత బంధుకు స్పష్టమైన తేడా ఉన్నది. పథకాన్ని నిరంతరం పర్యవేక్షించడం, ఫలితాలను అధ్యయనం చేయడం, రక్షణ నిధిని ఏర్పాటుచేయాలని నిర్ణయించడం శుభపరిణామం.

 • మల్లేపల్లి లక్ష్మయ్య, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దళితవాడ.. ప్రగతిజాడ
దళితవాడ.. ప్రగతిజాడ
దళితవాడ.. ప్రగతిజాడ

ట్రెండింగ్‌

Advertisement