దుబాయ్: యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఎడారి దేశంలో ఆదివారం జరిగిన పోరులో ధోనీ సేన 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (3), సురేశ్ రైనా (4), మొయిన్ అలీ (0), డుప్లెసిస్ (0) ఘోరంగా విఫలమవగా.. అంబటి రాయుడు (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, మిల్నే తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 8 వికెట్లకు 136 పరుగులే చేసింది. సౌరభ్ తివారి (50 నాటౌట్) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (3), ఇషాన్ కిషన్ (11) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో బ్రేవో 3, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. రుతురాజ్ గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దూరమవడం ముంబై ఫలితంపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించగా.. ఆటగాళ్లంతా నూతనోత్సాహంలో కనిపించారు.
స్కోరు బోర్డు
చెన్నై: గైక్వాడ్ (నాటౌట్) 88, డుప్లెసిస్ (సి) మిల్నె (బి) బౌల్ట్ 0, అలీ (సి) తివారి (బి) మిల్నె 0, రాయుడు (రిటైర్డ్ హర్ట్) 0, రైనా (సి) రాహుల్ (బి) బౌల్ట్ 4, ధోనీ (సి) బౌల్ట్ (బి) మిల్నె 3, జడేజా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 26, బ్రేవో (సి) కృనాల్ (బి) బుమ్రా 23, శార్దూల్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 156/6. వికెట్ల పతనం: 1-1, 2-2, 2-3*, 3-7, 4-24, 5-105, 6-144, బౌలింగ్: బౌల్ట్ 4-1-35-2, మిల్నె 4-0-21-2, బుమ్రా 4-0-33-2, పొలార్డ్ 2-0-15-0, రాహుల్ 4-0-22-0, కృనాల్ 2-0-27-0.
ముంబై: డికాక్ (ఎల్బీ) దీపక్ 17, అన్మోల్ప్రీత్ (బి) దీపక్ 16, సూర్యకుమార్ (సి) డుప్లెసిస్ (బి) శార్దూల్ 3, ఇషాన్ (సి) రైనా (బి) బ్రేవో 11, సౌరభ్ (నాటౌట్) 50 , పొలార్డ్ (ఎల్బీ) హజిల్‌వుడ్ 15, కృనాల్ (రనౌట్) 4, మిల్నె (సి) (సబ్) గౌతమ్ (బి) బ్రేవో 15, రాహుల్ (సి) రైనా (బి) బ్రేవో 0, బుమ్రా (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 136/8. వికెట్ల పతనం: 1-18, 2-35, 3-37, 4-58, 5-87, 6-94, 7-134, 8-135, బౌలింగ్: దీపక్ 4-0-19-2, హజిల్‌వుడ్ 4-0-34-1, శార్దూల్ 4-0-29-1, అలీ 3-0-16-0, బ్రేవో 4-0-25-3, జడేజా 1-0-13-0.